ఫేస్‌బుక్‌ గుణపాఠం | Karthukalai Pathivu Sei Movie First Look | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 10 2018 11:02 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Karthukalai Pathivu Sei Movie First Look - Sakshi

‘కరుత్తుగళ్‌ పదివు చెయ్‌’ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

తమిళసినిమా: ఫేస్‌బుక్‌ ఉపయోగించే అమ్మాయిలందరికీ ఒక పాఠంగా ‘కరుత్తుగళ్‌ పదివు చెయ్‌’ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు రాహుల్‌ అంటున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూటర్స్‌ రంగంలోనూ మంచి అనుభవం గడించిన  ఆర్‌పీఎం సినిమాస్‌ అధినేత రాహుల్‌ ఇంతకుముందు ‘జిత్తన్‌ 2’, ‘1ఏఎం’ వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించడంతో పాటు ‘కళత్తూర్‌ గ్రామం’, ‘143’ చిత్రాలను విడుదల చేశారు. తాజాగా ఆయన మెగాఫోన్‌ పట్టి నిర్మిస్తున్న చిత్రం ‘కరుత్తుగళ్‌ పదివు చెయ్‌’.

ఈ చిత్రం ద్వారా దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్‌ఎస్‌ఆర్‌ మనుమడు ఎస్‌ఎస్‌ఆర్‌.ఆరియన్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌గా ఉపాసనరాయ్‌ నటిస్తోంది. మిర్చి శివ హీరోగా నటించిన ‘యా యా’ చిత్ర దర్శకుడు రాజశేఖర్ ఈ సినిమాకు  కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. రాహుల్‌ దర్శకత్వం వహించి నిర్మించిన ‘కరుత్తుగళ్‌ పదివు చెయ్‌’ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని దర్శక నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. దీనికి మనోహర్‌ ఛాయాగ్రహణం, గణేశ్‌ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement