womensday
-
ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 తగ్గించిన కేంద్రం
-
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నారీమణులు!
ఒకప్పుడు అమ్మాయి పుట్టిందంటే మైనస్ అని భావించేవారు..చదువుల్లో, ఇతర రంగాల్లో వారికి అవకాశాలు తక్కువగా ఉండేవి. సమాజంలో ‘అబల’ అనే వివక్షను సైతం ఎదుర్కొనేవారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వివిధ పథకాల అమలులో తరుణీమణులకు పెద్ద పీట వేయడంతో వారిజీవితాలు మెరుగుపడ్డాయి. అవకాశాల్లో సగ భాగం కల్పించడంతో పలు రంగాల్లో మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారు. నేడు (సోమవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు: మహిళాభ్యున్నతి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్త్రీనే ఇంటి యజమానురాలిగా మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. చట్ట సభల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనులు.. ఇలా అనేక వాటిలో సగం మహిళలకే కేటాయించారు. వివక్ష లేకుండా మహిళలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చి అతివల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. బాలికా సంరక్షణ.. జిల్లాలో బాలికల సంరక్షణ యూనిట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న అమ్మాయిలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి చూపుతున్నారు. ఆపైన వయస్సు ఉన్న మహిళలకు కూడా వివిధ సహాయ సహకారాలు అందిస్తున్నారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల నివారణకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్ల వయస్సులోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బాలికా సంరక్షణ కేంద్రం ద్వారా అనాథ, సొంతవాళ్లు లేనివాళ్లను చేరదీసి పోషిస్తున్నారు. దత్తత కేంద్రం ద్వారా పిల్లలను 5వ తరగతి వరకు అక్కడే చదివిస్తున్నారు. 6 నుంచి కేజీబీవీ విద్యా సంస్థల్లో చదివించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత ఇస్తున్నారు. దిశ వన్ స్టాప్ సెంటర్ హింస, వేధింపుల నుంచి ఆడ పిల్లలకు రక్షణ కల్పించేందుకు దిశ వన్‌స్టాప్ సెంటర్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, గైనకాలజీ, ఫొరెన్సిక్, ఆర్ఎంఓ వైద్యులను కేటాయించారు. ఒక దుర్ఘటన జరిగితే ఆడపిల్లలు పోలీస్, లాయర్లు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఒకే చోట సేవలన్నీపొందే వీలు కల్పించారు. అలాగే కిశోర బాలికల కోసం వైఎస్సార్ కిశోర వికాసం పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో తొమ్మిది రకాల సేవలు అందిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, బాల్య వివాహాలను అరికట్టడం, బాల కారి్మక వ్యవస్థను నిర్మూలించడం, బాలికల అక్రమ రవాణాను అడ్డుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. ఈ పథకం కింద సలహాలు, సూచనలు అందిస్తారు. జిల్లాలో 3,126 మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 2,399 కిరాణా దుకాణాలకు రూ. 8.03 కోట్లరుణాలు మంజూరు చేసింది. అలాగే 675 మంది మహిళలకు గొర్రెలు, మేకల యూనిట్లు ఇప్పించింది.విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మ ఒడి పథకం కింద జిల్లాలో 4,12,884 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి ఏడాది రూ.15వేలు చొప్పున ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 2.42లక్షల మంది బాలింతలకు, అలాగే 1.92 లక్షల మంది పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సాయం కోసం ఫోన్ నంబర్లు.. స్త్రీ, శిశు సంరక్షణ కోసం ఉచిత ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 181 (ఉమెన్), 1098 (చైల్డ్ ), 112, 100, 1091, 08518–255057(పోలీసు సహాయం కోసం) 24గంటలూ పనిచేస్తాయి. -
వుమెన్స్ డే: మెన్స్ డే కావాలని బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్న నేపథ్యంలో పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్ మాన్సింగ్ అన్నారు. పురుషులకు ‘మెన్స్ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు. కాగా, మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సంక్షోభంలో పురుషులతో సమానంగా మహిళలు సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 2021వ ఏడాదిని ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్ నిర్మించుకోవడం’’అన్న థీమ్‌తో ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణ హత్య! -
ఫేస్బుక్ గుణపాఠం
తమిళసినిమా: ఫేస్బుక్ ఉపయోగించే అమ్మాయిలందరికీ ఒక పాఠంగా ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు రాహుల్ అంటున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోనూ మంచి అనుభవం గడించిన ఆర్పీఎం సినిమాస్ అధినేత రాహుల్ ఇంతకుముందు ‘జిత్తన్ 2’, ‘1ఏఎం’ వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించడంతో పాటు ‘కళత్తూర్ గ్రామం’, ‘143’ చిత్రాలను విడుదల చేశారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం ‘కరుత్తుగళ్ పదివు చెయ్’. ఈ చిత్రం ద్వారా దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్ఎస్ఆర్ మనుమడు ఎస్ఎస్ఆర్.ఆరియన్ హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్గా ఉపాసనరాయ్ నటిస్తోంది. మిర్చి శివ హీరోగా నటించిన ‘యా యా’ చిత్ర దర్శకుడు రాజశేఖర్ ఈ సినిమాకు కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించి నిర్మించిన ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని దర్శక నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. దీనికి మనోహర్ ఛాయాగ్రహణం, గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. -
ఆకాశంలో సగం
-
‘ఇంతి’ంతై..
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అనేది మొన్నటి మాట. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉద్యోగాల్లో సైతం ముందుంటున్నారు. వ్యవసాయంలోనూ తమ సత్తా చాటుతున్నారు. పట్టుదలతో తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత సాధన దిశగా కదం తొక్కుతున్నారు. నేడు మహిళాదినోత్సవం ఈ సందర్భంగా.. తెనాలి టౌన్, న్యూస్‌లైన్ పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతోమంది మహిళలు అధికారులుగా పనిచేస్తున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారి అభిప్రాయాలు.. సెల్ఫ్ ప్రొటెక్షన్‌పై తరగతులు నిర్వహించాలి.. ప్రాథమిక విద్యాదశ నుంచే బాలికలకు పాఠశాలల్లో సెల్ఫ్ ప్రొటక్షన్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. మహిళా దినోత్సవం నిర్వహణ వల్ల సామాజికాంశాల్లో అవగాహన వస్తుంది. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. - కె.జ్యోతిరమణి, ఏడీఏ అబ్బాయిలకూ అవగాహన కల్పించాలి.. ఈ రోజుల్లో ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోంది. సమాజంపై అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలి. పురుషులతో పాటు అన్ని పనులు చేసే ఘనత మహిళలకే దక్కుతుంది. -పి.లావణ్య, మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్థిక స్వాతంత్య్రం రావాలి.. సమాజంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. బాలికలను పెంచే విధానంలో మార్పురావాలి. ధైర్యసాహసాలను పెంపొందించి, ఆత్మనూన్యతాభావాన్ని పారదోలాలి. - ఎ.సులోచన, సీడీసీవో విద్యతో విజ్ఞానం.. విద్య వల్ల విజ్ఞానం కలుగుతుంది. అభివృద్ధికి కారణం అవుతుంది. పురుషుల సహకారం ఎంతో అవసరం. సంప్రదాయాలను పాటిస్తూ, కుటుంబ పరిస్థితులను చూసుకుంటూ ఉద్యోగాల్లో పురుషులతో పాటు ధీటుగా పనిచేస్తున్నాం. -కె.అమలకుమారి, వ్యవసాయాధికారి చిన్నచూపు తగదు.. సమాజంలో ఆడపిల్లలపై చిన్నచూపు తగదు. సమాజంలో మహిళలను గౌరవించాలనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి. ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ బి.శ్రీదేవి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వ్యవ‘సాయం’లోనూ.. పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్ : సేంద్రియ వ్యవ‘సాయం’లో ఈ మహిళలు భాగస్వాములవుతున్నారు. డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యలు సంయుక్తంగా అమలు చేస్తున్న సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానంలో భాగంగా ఎలాంటి రసాయనిక, పురుగుమందులు వినియోగించకుండా వ్యవసాయం చే యిస్తూ మండలంలో పలువురి ప్రశంశలు పొందుతున్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 14 మంది మహిళలు గ్రామ కోర్డినేటర్లుగా పనిచేస్తూ సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది మండలంలో గోకరాజునల్లిబోయినవారిపాలెం గ్రామంలో ఎన్‌పీఎం(నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న పంటలను చూసిన రాష్ట్రస్థాయి అధికారుల బృందం మహిళలను అభినందించింది. ఈ సందర్భంగా మహిళలు అభిప్రాయాలు.. మహిళలే ముందంజ.. మండలంలో సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. సంప్రదాయ వ్యవసాయంలోనూ, నూతన పద్ధతుల సాగులోనూ మహిళలు ముందున్నారనడానికి ఇదే నిదర్శనం. - వరధానం (క్లస్టర్ కోఆర్డినేటర్ )