టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు  | TDP Leaders False Propaganda On YSRCP Government | Sakshi
Sakshi News home page

టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు 

Published Mon, Sep 6 2021 9:50 AM | Last Updated on Mon, Sep 6 2021 10:06 AM

TDP Leaders False Propaganda On YSRCP Government - Sakshi

నాడు నేడుతో సరికొత్తగా మారిన ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ నాయకులు కొత్త గొంతుక ఎత్తుకున్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన జిల్లాగానే పేరు పొందిన శ్రీకాకుళాన్ని తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏళ్లకు ఏళ్ల పాటు ఇక్కడ పాలించి వెనుకబాటు కిరీటాన్ని సిక్కోలు నెత్తిన గుచ్చిన ఆ పాలకులు ఇప్పుడు అవాస్తవాలను నిస్సిగ్గుగా ప్రచా రం చేసుకుంటున్నారు. చెప్పుకోవడానికి శాశ్వత పని ఒక్కటీ లేక.. వైఎస్‌ జగన్‌ సర్కారుపై విషం చిమ్ముతున్నారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జిల్లా అవినీతిని చూసింది తప్ప అభివృద్ధిని మచ్చుకైనా చూడలేదు. అచ్చెన్నాయుడు వంటి నేతలు అనుచరులకు తప్ప ఇంకొకరికి న్యాయం చేసిన దాఖలా లేదు. మరోవైపు వైఎస్‌ జగన్‌ సర్కారు సిక్కోలుపై మొదటి నుంచి అభిమానం చూపిస్తూనే ఉంది. కోవిడ్‌ ఆపత్కాలంలో కూడా సంక్షేమాలు ఆపకుండా జిల్లాను ఆదుకుంది. కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న టీడీపీ నేతలు వీటిని చూడలేక, చూసినా ఓర్వలేక సోషల్‌ మీడియా వేదికల్లో విషం కక్కుతున్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో సిక్కోలుకు లబ్ధి ఇలా..
కిడ్నీ వ్యాధి రూపుమాపడానికి కిడ్నీ వ్యాధుల రీ సెర్చ్‌ సెంటర్‌ మంజూరు. పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు
సీతంపేటలో రూ.49 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశారు
ఉద్దానం తాగునీటి వెతలు తీర్చేందుకు రూ.700 కోట్లతో పనులు చేస్తున్నారు
నాడు–నేడు కింద జిల్లాలో 83 ఆస్పత్రులను రూ.47కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా 1200 పోస్టులను భర్తీ చేశారు
భావనపాడులో రూ.3200 కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం
బుడగట్లపాలెంకు రూ. 332 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ మంజూరు
మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం
మత్స్యకార భరోసా కింద 2021లో 16,630మందికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం. 1534 మందికి లీటర్‌ డీజిల్‌కు 9 రూపాయల చొప్పున సబ్సిడీ అందజేత
వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, జగనన్న అమ్మఒడి కింద సంక్షేమాల అందజేత
నాడు–నేడు కింద 2019–20లో 1249 పాఠశాలలను రూ. 364.47కోట్లతో, 2020–21లో 1090 పాఠశాలలను అభివృద్ధి చేశారు
జిల్లాకు కొత్త జూనియర్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు.
వంశధార ప్రాజెక్టు పనులు జోరుగా చేయిస్తున్నారు
నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు
పాలకొండ, పలాసకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూని ట్లు మంజూరు చేశారు
తిత్లీ తుపానులో నష్టపోయిన వారికి ఏకంగా ఒక్కో చెట్టుకు రూ.3000, జీడి తోటలకు హెక్టార్‌కు  రూ.50 వేలు మంజూరు చేశారు
జిల్లాలో 13,435 మందిని గ్రామ వలంటీర్లుగా, 1715 మందిని వార్డు వలంటీర్లుగా నియమించగా.. 7697 మందికి సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి
నిత్యం అందుతున్న సంక్షేమాలు, బడులు, ఆస్పత్రుల్లో జరుగుతున్న పనులను చూస్తే ఎవరి హ యాంలో అభివృద్ధి జరుగుతోందో ఇట్టే అర్థమవుతుంది

అప్పట్లో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శ్రీకాకుళంలో అభివృద్ధి జరిగింది. మళ్లీ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే జరుగుతోంది. శాశ్వత ప్రాజెక్టులేవీ చేపట్టకుండా.. తామే పనులు చేశామని చెప్పుకుంటున్న టీడీపీ నేతల తీరుపై జనం నవ్వుకుంటున్నారు

ఇవీ చదవండి:
కమ్యూనిటీ హాలే.. టీడీపీ కార్యాలయం   
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement