TDP Chandrababu Naidu, Ramoji Rao, False Propaganda On YSRCP Govt - Sakshi
Sakshi News home page

తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం

Published Sat, Apr 1 2023 3:26 AM | Last Updated on Sat, Apr 1 2023 11:08 AM

తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం - Sakshi

పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్‌పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! 

మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్‌ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్‌ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్‌ కట్టాల్సిన పరిస్థితుల్లో  తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్‌ సంస్థ బిడ్‌ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా  దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!!

ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్‌ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్‌. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్‌వీఆర్‌ ఇన్‌ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్‌లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్‌ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!.  

రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నుంచి ఫైబర్‌నెట్‌ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం..

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్‌ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్‌ వెంచర్స్‌’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది.

కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు.

ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్‌స్టాప్‌ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్‌కాంట్రాక్టరుగా టర్న్‌కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్‌కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!.  

2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? 
‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్‌కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు.   ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? 

మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్‌సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్‌ రీచ్‌లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్‌ సీపీ నాయకులెందుకు సబ్‌కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? 

అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? 
యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్‌’ నెంబరుకు కాల్‌ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్‌ నెంబరు కూడా ఇస్తున్నారు.

ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్‌ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్‌ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్‌ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా?

బాబు అక్రమాలకు... ఎన్‌జీటీ 100 కోట్ల జరిమానా 
చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) విచారణ  జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది.

టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!!

సబ్‌ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? 
వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్‌కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్‌కు ఇస్తే... ఆ శ్రీనివాస్‌ సదరు పనులను సీఎం రమేష్‌ కంపెనీకి సబ్‌ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ?  అసలు నిజంగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్‌ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి.
చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement