సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని దసపల్లా భూములకు సంబంధించి కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని.... పుంఖానుపుంఖాలుగా ఎల్లో మీడియా వెలువరిస్తున్న పొంతనలేని కథనాల్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్లాట్ల యజమానులు, డెవలపర్లు ఖండించారు. ఇది పూర్తిగా కొందరు వ్యక్తుల ప్రయివేటు వ్యవహారమైనా... ఆ వ్యక్తులకు– డెవలపర్‌కు మధ్య జరిగిన ఒప్పందం పూర్తిగా వారికి సంబంధించినదే అయినా... దాన్ని కూడా తప్పుబడుతూ కథనాలు వెలువరించటంపై వారు విస్మయం వ్యక్తంచేశారు.
నిజానికి భూ యజమానితో డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకున్నపుడు డెవలప్ చేసే నిర్మాణంలో తనకు ఎంత వాటా ఇవ్వాలనేది డెవలపర్ ఇష్టం. దానికి అంగీకరించాలా? వద్దా? అనేది భూ యజమానుల ఇష్టం. ఈ వాటా ఒకో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. డెవలపర్ నిరి్మంచబోయే బిల్డింగ్ స్థాయిని బట్టి ఈ వాటా మారుతుంటుంది. మరీ హైఎండ్ నిర్మాణాలైతే భూ యజమానికి తక్కువ వాటా ఇవ్వటం, సాధారణ నిర్మాణాలైతే కొంత ఎక్కువ వాటా ఇవ్వటం పరిపాటి.
ఎందుకంటే హైఎండ్ నిర్మాణాలకు ఎక్కువ ఖర్చవుతుంది. దాన్ని డెవలపరే భరించాల్సి ఉంటుంది కనక. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే తాము ఒప్పందం చేసుకున్నా... అందులో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందని, ప్రభుత్వం తప్పు చేసిందనే రీతిలో దారుణమైన కథనాలు వెలువరిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని వారు ఖండించారు. దీనిపై తమ వాదన కూడా వినాలంటూ శనివారమిక్కడ వాస్తవాలను వారు మీడియా ముందుంచారు. ఆ వివరాలివీ...
దసపల్లా భూముల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆ భూములను డెవలప్‌మెంట్‌కు తీసుకున్న అష్యూర్ డెవలపర్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూ 20 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి కనక తాము 65 మందీ కలిసి ఇష్టపూర్వకంగా డెవలప్‌మెంట్ కోసం ఒప్పందం చేసుకున్నామని భూ యజమానులు స్పష్టంచేశారు.
సుప్రీం కోర్టు దాకా తాము చేసిన న్యాయ పోరాటాన్ని... సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా అమలు చేయకపోవటంతో చివరకు ప్రభుత్వం కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి రావటాన్ని, ఆ నేపథ్యంలో విధిలేక కోర్టు నిర్ణయాన్ని అమలు చేయటాన్ని ఈ సందర్భంగా వారు పరోక్షంగా గుర్తుచేశారు. శనివారమిక్కడ ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలు వివరించారు. ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలను, దు్రష్పచారాన్ని ఇకనైనా ఆపాలని కోరారు. భూములు కొనుగోలు చేసినప్పటి నుంచి.. ఇటీవల జరిగిన అగ్రిమెంట్ వరకూ ప్రతి అంశం అందరి ఆమోదయోగ్యంతో, పారదర్శకంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
ఇంకా ఏమన్నారంటే...
అందరం ఇష్టపూర్వకంగానే ఒప్పందం చేసుకున్నాం: జాస్తి బాలాజీ, భూ యజమాని
మా కుటుంబ సభ్యులకు ఇందులో ప్లాట్లున్నాయి. మా 65 మందిలో చాలా మంది బిల్డర్లు ఉన్నారు. ఈ ప్రాజెక్టు చేసేందుకు అందులో కొందరు ముందుకొచ్చారు కూడా. కాకపోతే మాలో మాకు విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు బయటవాళ్లకు డెవలప్‌మెంట్‌కు విశాఖలో సిగ్నేచర్ భవనమైన ఆక్సిజన్ టవర్స్‌ను నిరి్మంచిన లాన్సమ్ ఉమేష్ మాకు ముందు నుంచీ పరిచయం ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదించగా ప్రాజెక్టు డిజైన్‌తో ముందుకొచ్చారు.
20 ఫ్లోర్స్ కడతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తరహాలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. భూములు 22ఏలో ఉన్నప్పటికీ.. పెండింగ్ రిజి్రస్టేషన్‌లో ఉన్నా ఫర్వాలేదనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరితో మాట్లాడి అగ్రిమెంట్‌కు వెళ్లాం. సుప్రీంకోర్టు... కోర్టు ధిక్కార పిటిషన్లో కూడా ఆదేశాలిచి్చంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కచి్చతంగా 22ఏ నుంచి తొలగిస్తుందనే నమ్మకంతో అడుగులు వేశాం. అందరి ఇష్టపూర్వకంగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం తప్ప దీన్లో ఎవ్వరి బలవంతమూ లేదు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి ఒక్కరం ఆనందంగా ఉన్నాం: కంకటాల మల్లిక్, భూ యజమాని
1996 నుంచి దసపల్లా హిల్స్‌లో నివాసముంటున్నాం. దసపల్లా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నా. గడిచిన 22 సంవత్సరాలుగా కోర్టు వివాదం వల్ల క్రయ విక్రయాలకు సంబంధించి దసపల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. 1990లో మా ఇల్లు పడగొట్టి కొత్తది కట్టేందుకు కూడా చాలా అవస్థలు పడ్డాం. అప్పట్లో మేం హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుని కట్టుకున్నాం. రెండు దశాబ్దాలకు పైగా వీటిని అమ్మలేక పోతున్నాం.. కొనలేకపోతున్నాం.. వీలునామా రాసినా ఇబ్బందులు తప్పటం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నుంచి ఈ భూముల్ని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వల్ల దసపల్లాలో నివాసముంటున్న ప్రతి ఒక్కరూ సంతోషపడ్డాం.
గత ప్రభుత్వ హయాంలో 70 వరకూ రిజి స్ట్రేషన్లు జరిగాయి: సుబ్బరాజు, భూ యజమాని, రాణి కమలాదేవి అడ్వకేట్
భూముల టైటిల్ కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లాం. ప్రతి కోర్టులోనూ, ప్రతి కేసులోనూ మాకే అనుకూలంగా తీర్పు వచ్చింది. 22ఏ నుంచి తొలగించాలని 2014లోనే సుప్రీం కోర్టు ఆదేశాలిచి్చంది. కానీ కలెక్టర్ అమలు చేయలేదు. కోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష కూడా విధించింది. దసపల్లా భూముల్లో చాలా వరకూ రాణి కమలాదేవి విక్రయించేశారు. 22ఏ నుంచి వీటిని తొలగించాలని 65 మంది ప్లాట్ ఓనర్స్ కోర్టుకి వెళితే... అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. రిజిస్టర్ చేసి.. 22ఏ నుంచి డాక్యుమెంట్లు రిలీజ్ చేయాలని కోర్టు స్పష్టం చేసినా.. సబ్ రిజిస్ట్రార్లు మాత్రం చెయ్యలేదు. దీంతో మరోసారి కోర్టుకి వెళ్లాం. 22ఏలో ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్లు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో 60 నుంచి 70 వరకూ ఈ తరహా రిజిస్టర్లు జరిగాయి. ఇప్పుడు అదే పద్ధతిలో మేం చేసుకుంటున్నాం.
విశాఖ, హైదరాబాద్‌లో ఇదే మాదిరిగా ఎన్నో ప్రాజెక్టులు: ఉమేష్, అష్యూర్ డెవలపర్స్ భాగస్వామి
దసపల్లా భూముల అభివృద్ధికి సంబంధించి ఒక చదరపు గజానికి 12 అడుగులు భూ యజమానికి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాం. అంటే 30: 70 నిష్పత్తిలో భూ యాజమానులకు, డెవలపర్లుకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నిష్పత్తి కొత్తదేమీ కాదు. విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర నగరాల్లో 30 కంటే తక్కువ శాతం కూడా భూ యజమానులకు ఇచ్చిన సందర్భాలున్నాయి. హైదరాబాద్‌లో నేను చేసిన రెండు ప్రాజెక్టుల్లో 25:75 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే.. మొత్తం 1500 నుంచి 1800 అపార్ట్‌మెంట్స్ కట్టాలి. ఇందుకు ఎనిమిదేళ్లుకి పైగా అవుతుంది.
ఈ సమయంలో అన్ని ధరలూ పెరుగుతాయి. పైగా.. దసపల్లా భూములు కొండ ప్రాంతంలో ఉన్నాయి. పైపెచ్చు నగరం నడి»ొడ్డున ఉన్నాయి కాబట్టి కంట్రోల్డ్ బ్లాస్ట్ చేసి రాళ్లని తొలగించలేం. రోప్ కటింగ్ లేదా కెమికల్ బ్లాస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా భారీ ప్రాజెక్టుల్లో ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ రావడం, అపార్ట్‌మెంట్స్ సేల్స్ అవ్వడం మొదలైనవి చాలా ఆలస్యమవుతాయి. దీనివల్ల బిల్డర్లకు ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి.
నాణ్యత, మౌలిక సదుపాయాలు.. ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తరహా ఒప్పందం చేసుకున్నాం. దీనికి ప్లాట్ల యజమానులందరూ అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్ జరిగింది తప్ప.. రాజకీయ ఒత్తిడుల వల్లనేనంటూ వస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. గతంలో ఎన్టీఆర్ ట్రస్టుకి పనిచేశాను. కానీ రాజకీయాల్లో లేను. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. ఆయన ప్రగతి భారతి ట్రస్టు స్థాపించిన నేపథ్యంలో... ఎనీ్టఆర్ ట్రస్టు మాదిరిగానే ఇక్కడా ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. అంతే తప్ప.. ఈ భూముల విషయంలోగానీ, రాజకీయం, బిజినెస్ విషయంలో గానీ ఆయన ప్రమేయం ఏమాత్రం లేదు.
ఏ సంస్థ నుంచి ఒక్క రూపాయి రాలేదు: గోపినాథరెడ్డి, అష్యూర్ డెవలపర్స్ భాగస్వామి
ఇటీవల వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. అవ్యాన్ రియల్టర్ల నుంచి నిధులు వచ్చాయన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. అవ్యాన్ డెవలపర్స్ నుంచి అష్యూర్ డెవలపర్స్‌కి ఈ ప్రాజెక్టు విషయంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కోవిడ్ సమయంలో ఇతర అవసరాల కోసం వచి్చన మొత్తాన్ని దసపల్లా భూముల కోసం వచి్చనట్లుగా చూపిస్తూ దు్రష్పచారం చేస్తున్నారు. దసపల్లా భూముల అభివృద్ధి ఒప్పందం విషయంలో ఏ విధమైన అవకతవకలు గానీ, రాజకీయ ప్రమేయం కానీ లేదు. పూర్తిగా బిజినెస్ పద్ధతిలోనే జరిగిన డీజీపీఏ అగ్రిమెంట్ ఇది. అంచనాల ప్రకారం సుమారు 29 లక్షల చదరపుటడుగులు నిర్మించవచ్చు. ఇందులో 9 లక్షల అడుగుల వరకూ భూ యజమానులకు ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment