ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్‌రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది.
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి.
నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది.
నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు.
యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు.
ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు.
రాజకీయ మీటింగ్‌లకు కుల సంఘాల మీటింగ్‌లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు.
హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్‌లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు.
ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్‌తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్‌రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది.
ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
Comments
Please login to add a commentAdd a comment