
సాక్షి, విజయవాడ : పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతున్న టీడీపీ నేత వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్’ అంటూ హెచ్చరికలు జారీచేశారు.
అదే విధంగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment