గోబెల్స్‌కు తమ్ముళ్లు.. టీడీపీ అబద్ధపు ప్రచారాలు | TDP False Propaganda In Srikakulam District | Sakshi
Sakshi News home page

గోబెల్స్‌కు తమ్ముళ్లు.. టీడీపీ అబద్ధపు ప్రచారాలు

Published Sun, Sep 12 2021 1:12 PM | Last Updated on Mon, Sep 20 2021 11:45 AM

TDP False Propaganda In Srikakulam District - Sakshi

టీడీపీ నాయకులు పార్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గోబెల్స్‌ వారసత్వాన్ని నిలబెట్టు కుంటున్నారు. అ.. అంటే అబద్ధం.. ఆ.. అంటే ఆరోపణ అనే అలిఖిత పార్టీ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తాజాగా పింఛన్ల విషయంలో అధికార పక్షంపై నోటికొచ్చిన అబద్ధాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. తమ హయాంలో వేలాది పింఛన్లను తీసేసి ఇప్పుడు పెండింగ్‌లో ఉంచిన పెన్షన్లపై అవాస్తవాలను వల్లె వేస్తున్నారు. (చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..)

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తొలగించిన పింఛన్లు 74,194. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పెండింగ్‌లో పెట్టిన పింఛ న్లు 9053. ఈ సంఖ్య చూస్తేనే ఏ ప్రభుత్వం పనితీరు ఏమిటో జనాలకు అర్థమైపోతుంది. చంద్రబాబు హయామంతా జన్మభూమి కమిటీల దోపి డీనే నడిచింది. వారు ఇవ్వమంటే ఇవ్వడం, కాదంటే తొలగించడం జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అర్హులైతే చాలు అందరికీ పింఛన్లు అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అనేక ఫిర్యా దుల నేపథ్యంలో విచారణ చేశాక కేవలం 9053 పింఛన్లను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వాటిపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోనుంది.

టీడీపీ హయాంలో జరిగిన ఘోరాలు  
భర్త ఉండి, కలిసి జీవిస్తూ టీడీపీ హయాంలో ఎందరో ఒంటరి మహిళల పింఛన్లు తీసుకున్నారు. ప్ర భుత్వ ఉద్యోగం చేసే వారు ఇంటిలో ఉన్నా పింఛ న్లు అందుకున్నారు. వేర్వేరు రేషన్‌కార్డుల్లో పేరు ఉండేలా చూసుకుని భార్యాభర్తలిద్దరూ పెన్షన్లు తీ సుకునేవారు. టీడీపీ హయాంలో పింఛన్ల పేరుతో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని తప్పు లు చేసిన నాయకులు ఇప్పుడు పింఛన్ల పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమ ని జనం అంటున్నారు. వృద్ధాప్య, వికలాంగ, వి తంతు, ఒంటరి మహిళల పింఛన్లలో జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన దోపిడీ జగద్విదితం. ఇలాంటి వాటిపై విచారణ చేసి కొన్ని పింఛన్లు అనర్హమైనవిగా గుర్తించి.. పరిశీలనలో పెడితే టీడీపీ నాయకులు తమకు అలవాటైన అబద్ధాలను జనంలోకి తీసుకెళ్తున్నారు.

విమర్శించే అర్హత ఉందా..? 
ఒకప్పుడు అర్హులైన అనేక మందిని జన్మభూమి క మిటీ సభ్యులు తొలగించేశారు. తమ పార్టీ కాదని, తమకు ఓటు వేయలేదని, తమ వర్గం కాదని అ న్యాయంగా ఎందరికో ఆధారం దూరం చేశారు. ఆ కమిటీ సిఫార్సులే కొలమానంగా అప్పట్లో పింఛ న్లు అందజేశారు. చివరికి కోర్టుకెళ్లి బాధితులు పింఛన్లు పునరుద్ధరించుకున్నారు. అప్పట్లో తొలగింపులపై అభ్యంతరాలు పెట్టినా వినలేదు. ఏమా త్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన తొలగించేశారు.

ఇలా చేస్తూ ఐదేళ్ల కాలంలో కేవలం 26వేల పింఛ న్లు మాత్రమే అదనంగా ఇచ్చారు. అదే వైఎస్‌ జగ న్‌ హయాంలో చూస్తే అలాంటి ఘోరాలు జరగలేదు. తన రెండేళ్ల పాలన కాలంలో 51వేలకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి అనర్హుల పింఛన్లు పెండింగ్‌లో పెడితే అన్యాయంగా పింఛన్లు తొలగించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడంపై జనం నవ్వుతున్నారు. అబద్ధాల ప్రచారంలో గోబెల్స్‌కు వారసులమని మరోసారి టీడీపీ నాయకులు నిరూపించుకున్నారంటున్నారు.

చదవండి:
ఒంగోలులో స్ట్రీట్‌ ఫైట్‌.. వీడియో వైరల్‌

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement