
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్‌కు పోలీసులు అప్పగించారు.
కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్‌పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment