
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఐడీ హెచ్చరించింది. అసత్యాల ప్రచారం, మార్ఫింగ్ ఫొటోలు పెడితే శిక్షార్హులవుతారని, డబ్బు ఇచ్చి ఇలాంటి వారిని పోత్సహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీఐడీ తెలిపింది.
చదవండి: దుష్ప్రచారం తిప్పికొట్టాలి
టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ ఎల్లపు సంతోష్‌రావును సీఐడీ సైబర్ క్రైమ్ అరెస్టు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన వీడియోను, మార్ఫింగ్ చేసి అశ్లీల పదజాలం చొప్పించి తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఎల్లపు సంతోష్‌రావును అదుపులోకి తీసుకున్నారు.
డబ్బు కోసమో, మరేదైనా లాభాపేక్షతో ప్రభుత్వాన్ని, మహిళలను, గౌరవప్రదమైన స్థానాల్లోని వారిని కించపరిచేలా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు భాషను వాడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడితే చర్యలు తప్పవని సీఐడీ పేర్కొంది.
ఏదైనా పోస్టును, వీడియోను, కామెంట్‌ను షేర్ చేసే ముందు అది నిజమా కదా నిర్థారించుకోవాలని, చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సీఐడీ తెలిపింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తించే, అశ్లీల, అబద్ధపు పోస్టులను పెట్టవద్దనీ, బాధ్యతయుతంగా మెలగాలని ఏపీ సీఐడీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment