నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని | Balineni Srinivasa Reddy Condemned False Propaganda Against Him | Sakshi
Sakshi News home page

నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని

Published Wed, Aug 10 2022 9:29 AM | Last Updated on Wed, Aug 10 2022 12:35 PM

Balineni Srinivasa Reddy Condemned False Propaganda Against Him - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.
చదవండి: దూషించిన నోటితోనే పులకింతా?

చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్  విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement