సాక్షి, అమరావతి: రాసిందే పదే పదే రాస్తే పాఠకులు నమ్మేస్తారన్నది రామోజీరావు భ్రమ. ప్రతీ అంశాన్నీ అటుతిప్పి ఇటు తిప్పి చివరికి ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కేలా ఉంటున్నాయి ఆయన రాతలు. గత టీడీపీ ప్రభుత్వంలోనే కుదేలైన ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దేందుకు తెగ ఆయాసపడుతూ ఎప్పటిలాగే మరో తప్పుడు కథనాన్ని అచ్చోశారు.
అసలు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులే లేవన్నట్లు ఆ కథనానికి కలరింగ్ ఇచ్చారు. ‘కరెంటు షాక్‌తో అల్లాడుతున్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల మూత’ శీర్షికతో మంగళవారం ఈనాడు అసత్యాలతో ఓ వంటకాన్ని వండి వార్చింది. దీని వెనకనున్న అసలు వాస్తవాలను ఇంధన, పరిశ్రమల శాఖలు వెల్లడించాయి. అవి..
ఆరోపణ: జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, బెదిరింపులు, దాషీ్టకానికి భయపడి ఇప్పటికే చాలా పరిశ్రమలు వెళ్లిపోయాయి..
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలవల్ల రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా.. వైఎస్సార్ జిల్లాలో సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. జపాన్‌కు చెందిన ‘యెకోమా’ సంస్థ ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమను గత ఏడాది ఉత్పత్తి ప్రారంభించింది. మరో రూ.1,000 కోట్లతో రెండోదశ కర్మాగారం నిర్మాణానికి సీఎం జగన్ ఇప్పటికే శంకుస్థాపన చేయడంతో శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వేధిస్తేనే వచ్చాయా?
ఆరోపణ: రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు.. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలూ మూతపడుతున్నాయి..
వాస్తవం: అనేక కారణాలవల్ల ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు గత కొన్ని దశాబ్దాలుగా ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్నాయి. అందువల్లే అవి మూతపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమీ జరగడంలేదు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇవి అనేకం మూతపడ్డాయి. గత ఇరవై ఏళ్లుగా ఈ విభాగంలో అమలులో ఉన్న టారిఫ్‌కు ఎలాంటి డిమాండు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, సమయానుసార ఛార్జీలు (టీఓడీ), తప్పనిసరి వినియోగం ఛార్జీలు విధించలేదు. కానీ, ఖర్చులు 54శాతం పెరిగాయి. ఇతర వినియోగదారులకు అవలంబిస్తున్నట్లుగానే ఈ పరిశ్రమలకూ డిస్కంలు చార్జీలను అమలుచేస్తున్నాయి. వీటి ప్రకారం చూసినా.. రాష్ట్రంలో వీటికి యూనిట్ ఛార్జి దాదాపు రూ.0.50 తక్కువే.
ఆరోపణ: ‘అమరరాజా’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో ఆ సంస్థ విస్తరణ ప్రాజెక్టుల్ని తెలంగాణ, తమిళనాడులో చేపట్టింది.
వాస్తవం: కాలుష్య కారకాలైన వాయు, ద్రవ పదార్థాలను నేరుగా వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ ప్రమాణాలను పాటించాలని ‘అమరరాజా’కు నోటీసులివ్వడం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నా ఊరుకోవాలా డ్రామోజీ?
ఆరోపణ: కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో టీడీపీ నిర్ణయించిన
భూముల ధరల్ని వైఎస్సార్‌సీపీ అధి కారంలోకి వచ్చాక ఐదురెట్లు పెంచింది.
వాస్తవం : ఏపీఐఐసీ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల ధరలను సవరించడం సర్వసాధారణం.
ఆరోపణ: విక్రయ ఒప్పందానికి రాలేదన్న కారణాలతో 74 మందికి స్థల కేటాయింపులను రద్దుచేసింది..
వాస్తవం: ఇందులో తప్పేముంది? భూముల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేటాయిస్తే నిరీ్ణత కాలంలో డబ్బు చెల్లించి రిజి్రస్టేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత పారిశ్రామిక సంస్థలది కాదా?
ఆరోపణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుంది..
వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. రకరకాల వివాదాల్లో ఉన్న భూమిని గత టీడీపీ ప్రభుత్వం రిలయన్స్‌కు కేటాయించింది. అందుకే విరమించుకుంది. కానీ, రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ విశాఖ సదస్సులో ప్రకటించిన విషయం గుర్తులేదా!?
Comments
Please login to add a commentAdd a comment