
సాక్షి, విజయవాడ: గుణదల, కృష్ణలంక శ్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశామని కోవిడ్ స్టేట్ నోడల్ అధికారి ఆర్జ శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ పేషెంట్ల శవాలతో శ్మశాన వాటికలంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా!
Comments
Please login to add a commentAdd a comment