మంత్రి జగదీశ్‌రెడ్డిపై అసత్యప్రచారం: కర్నె
హైదరాబాద్‌సిటీ: సోషల్ మీడియాలో, కొన్ని చానళ్లలో పనిగట్టుకుని మంత్రి జగదీశ్ రెడ్డి మీద అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. వీడియోలో ఉన్న సంతోష్‌కు, టీఆర్‌ఎస్, మంత్రి జగదీశ్‌రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. టీఆర్‌ఎస్‌వీ నాయకులే అతన్ని అరెస్ట్ చేయండని చట్టప్రకారం చర్యలు తీసుకొమ్మని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
సంతోష్ గతంలో కాంగ్రెస్ నాయకుడిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడని, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడని చెప్పారు. సంతోష్, మంత్రి జగదీశ్ రెడ్డి మనిషని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాపార్టీపైనా, మా మంత్రి పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నామని తెలిపారు.