సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పంచాయతీ రాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇంచార్జిలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల దృష్టిలో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుంది.. న్యాయ పరంగా దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం
గతంలో మాదిరిగానే ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే పత్రాలు నుంచి ప్రతి విషయంలోనూ న్యాయ విభాగం సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు స్టైపండ్ ఇస్తుందని, అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వివిధ విభాగాలకు సంబంధించి కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నేతృత్వంలో న్యాయవిభాగ సమావేశం జరిగింది.
చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకే..
Comments
Please login to add a commentAdd a comment