
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బైజూస్‌పై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులపై మీకు(రామోజీరావు) ఎందుకు అంత అక్కసుని దుయ్యబట్టారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ? అని నాగార్జున యాదవ్ సూటీగా ప్రశ్నించారు.
చదవండి: చుక్కలు చూపిస్తానన్న పవన్‌కు డిపాజిట్ కూడా రాలేదు: సీఎం జగన్