హైదరాబాద్: ఈనాడు పత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్న రామోజీరావుకు ఆ పార్టీ బహిరంగ లేఖ రాసింది. తెలుగు జర్నలిజాన్ని వ్యాపారంగా దిగజార్చారని దుయ్యబట్టింది. 'రామోజీ..మీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. మీరు నమ్ముకున్న చంద్రబాబు నట్టేట మునగడంతో మీరు ఎంత పిచ్చివాడిలా మారారో రెండు నెలలుగా మీ పత్రికను చూస్తే అర్ధమవుతుంది. తెలుగు జర్నలిజాన్ని వ్యాపారంగా దిగజార్చినట్టుగా... మీ వ్యాసాంగం సాగుతోంది. ప్రజలంతా అభివృద్ధికి మారుపేరు దివంగత మహానేత వైఎస్ఆర్ అంటే.. మీరెందుకు గంగవెర్రులు ఎత్తుతున్నారు' అని వైఎస్ఆర్ సీపీ లేఖలో పేర్కొంది. ఈనాడు పత్రికకు, అధినేత రామోజీ రావుకు వైసీపీ సంధించిన ప్రశ్నలు..
- 1947 ముందు ఈనాడు అనే టీడీపీ కరపత్రం లేకపోవడం ప్రజల అదృష్టం
- పెన్నుపెన్నునా విషం నింపుకున్న మీ పత్రిక ఉంటే... మహాత్మాగాంధీకి కూడా అవినీతి ఆరోపణలు అంటగట్టేవారు
- ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తుంటే.. మీ పత్రిక ఒక్క ముక్కకూడా రాయలేదెందుకు?
- కేవలం జగన్‌ను ఎజెండా చేసుకుని... పత్రిక నడుపుతున్న తీరు రోత పుట్టిస్తోంది
- మీ నైరాశ్యం, నిస్పృహ, ఉన్మాదం, ఉగ్రవాదం చూసి.. మీ మీద సానుభూతి వ్యక్తం చేయాలనిపిస్తుంది
- పిచ్చి ముదిరిన ఉన్మాదుల్ని చూస్తే.. సమాజం జాలి చూపిస్తుందే తప్ప ఆగ్రహం ప్రదర్శించదు
- ప్రతీ ఎన్నికల ముందు మీరు పాంచజన్యం ఊదుతారు
- జగన్ ఉండాల్సింది జైల్లో అంటూ... వందలకొద్ది సంపాదకీయాలాంటివి రాస్తారు
- జగన్ కుటుంబంపై టన్నుల కొద్ది విషాన్ని నింపుతారు
- మీ పాఠకుల ఇళ్లల్లో మీ టీడీపీ కరపత్రాన్ని విసురుతారు
- మీరు ఊదిన పాంచజన్యం స్ఫూర్తితో.. ప్రజలు కసితీరా చంద్రబాబును ఓడగొడుతున్నారు
- ఎందుకు ఇలా జరుగుతోందో ఆలోచించే విజ్ఞత మీకెందుకులేదు?
- అయినా రామోజీ..బాబును గెలిపించాలన్న ఆరాటం మీకెందుకు
- అసలు బాబుతో మీకున్న సంబంధమేంటి?
- చంద్రబాబు ఓడితే మీకు వచ్చిన నష్టం ఏంటి?
- బాబు గెలిచినప్పుడు ప్రజలకు వచ్చిన లాభం ఏంటి?
- తన 9ఏళ్ల పాలన తెస్తానని బాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు
- మద్యనిషేధ ఉద్యమకారుడైన మీరు... మీ హోటళ్లలో మద్యం అమ్మకూడదనే నిర్ణయాన్ని
- ఎందుకు తీసుకోలేపోయారు
- ఉదయం పత్రికను హత్య చేయించడానికేగా.. మీ మద్యనిషేధ ఉద్యమం పుట్టింది
- ఇన్ని దురాగతాలు చేసిన మీరు... పెన్ను పట్టుకున్న ఉగ్రవాది కాక మరేంటి?
- వైఎస్ఆర్ మరణించేవరకు జగన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు
- సోనియాను ఎదిరించాకే జగన్‌పై క్రిమినల్ కేసులు
- ఆ దర్యాప్తులు, వేధింపులు నేటికీ కొనసాగుతున్నాయి
- దేశంలోని చట్టాలు వర్తించవని ఎప్పడూ వాదించలేదు
- అదే మీరైతే ఆర్బీఐ సెక్షన్ 45S వర్తించదని వాదించారు
- మార్గదర్శి ద్వారా మనదికాని మంది సొమ్మును..మూటగట్టిన వాడిని ఆర్ధిక నేరగాడు అనాలా.. ఆర్ధిక ఉగ్రవాది అనాలా..పత్రికాధిపతి అనాలా
- హైదరాబాద్‌లో మూడు వేల ఎకరాల భూమిని... కార్పొరేట్ చట్టాలు అడ్డంపెట్టుకుని ఆక్రమించారు
- అసైన్డ్ భూముల్ని సైతం మింగేశారు
- ప్రభుత్వం భూముల్ని వెనక్కి ఇవ్వమంటే... కోర్టులో స్టే తెచ్చుకున్నారు
- విశాఖలో స్థలం కోసం 8ఏళ్లు న్యాయపోరాటం చేసి.. కాలం వెళ్లదీసిన దరిద్రపు చరిత్ర మీదికాదా
- అసలు మీ జీవితంలో ఏ అణువులోనైనా నిజాయితీ కనిపిస్తోందా
- మీ మీద ఉన్న కేసులు, నేరారోపణలు మరే పత్రికాధిపతిపై ఉన్నాయా?
- అసలు ఈనాడును పత్రికా కార్యాలయంలో ప్రింట్ చేస్తున్నారా.. పిచ్చాసుపత్రిలో ప్రింట్ చేస్తున్నారా..
- YSR మరణించి నాలుగేళ్లు దాటింది..ఆ రెండక్షరాలు ఉంటే.. మీ కాళ్లు చల్లబడుతున్నాయెందుకు రామోజీ
- రాష్ట్రాన్ని ముక్కలు చేసింది సోనియా.. అందుకు కత్తిలాంటి లేఖ ఇచ్చింది చంద్రబాబు
- సోనియాపై విమర్శ చేస్తే మీ నాలుక చీరేస్తారని భయపడ్డారా?
- మీరు స్టే తెచ్చుకున్న కేసుల్లో.. విచారణ చేస్తే శిక్ష పడుతుందని భయపడ్డారా
- టీడీపీని గెలిపించడానికి మీరు చేసిన ప్రతీ ప్రయత్నంలోనూ... చంద్రబాబు మీరు జాయింట్‌గా ఓడిపోయారు