
ఇంతకీ స్పాన్సర్స్ ఎవరు?
35 కళా బృందాలు
1500 భారీ హోర్డింగులు
10 లక్షల టీ-షర్టులు
15 లక్షల టోపీలు
ఈ లిస్టు ఏంటనుకుంటున్నారా? సీఎం కిరణ్ పెట్టే కొత్త పార్టీకి సన్నాహాలు. సమైక్య నినాదాన్ని ఘనంగా వినిపించే ప్రయత్నంలో భాగం జరుగుతున్న ప్రయత్నం ఇదంతా. సమైక్య ఛాంపియన్‌ను తానేనని ఎంత గట్టిగా ఘీంకారాలు చేస్తున్నా ఎవరూ గుర్తించకపోవడంతో... ప్రచారాన్ని భారీగా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 23వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందని ఇటీవల చాలా సందర్భాలలో కిరణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కొత్త పార్టీ ఆవిష్కరణ 23నే జరుగుతుందని భావిస్తున్నారు.
దాదాపు 200 కోట్ల రూపాయల్ని ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రచారం కోసం ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ముంబయి కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత కన్సలెన్ట్సీ ఈ ప్రచార బాధ్యతల్ని భుజాలకెత్తుకుంది. ఎఫ్ఎం రేడియోలు, టీవీలు, థియేటర్లలోనూ సమైక్యవాదం గట్టిగా వినిపిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3 జిల్లాల్లో ఈ మేరకు రిహార్సిల్స్ మొదలు పెట్టేశారు కూడా.
ఇక కొత్త పార్టీ వెనుక విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సీఎం కిరణ్, ఆయన సోదరుడు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. సీఎం కిరణ్ పైసా విదిల్చే రకం కాదని ఆయన సన్నిహితులే చెప్తారు. లగడపాటికి అంత సీన్ లేదంటారు? మరీ ఇంత భారీ ఫండింగ్ చేస్తున్నది ఎవరూ? సమైక్య పార్టీ హడావుడి ఆర్భాటం వెనుక ఉన్నది రామోజీరావు, చంద్రబాబు నాయుడట.
ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిన ఎదిగిన జగన్‌ను ఎదుర్కొనేందుకు కిరణ్‌ను పావుగా ఎంచుకున్నారని సమాచారం. తమ సామాజిక వర్గానికి చెందిన లగడపాటిని మధ్యవర్తిగా పెట్టారని పొలిటికల్ సర్కిల్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నాటకంలో లగడపాటి కూడా తన పాత్రను అద్భుతంగా పోషిస్తూ రామోజీ, చంద్రబాబు దగ్గర మంచి మార్కులే కొట్టేస్తున్నారట.
కిరణ్ బలాన్ని భూతద్దంలో చూపి సమైక్యం విషయంలో బాహుబలి అని పైకెత్తేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జనం మాత్రం సమైక్యం పేరుతో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని తప్పుబడుతున్నారు. ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సమైక్యం కోసం ఉద్యమాలు చేస్తుంటే... ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు ఈ ప్రచారమేంటని ప్రశ్నిస్తున్నారు.