‘రామోజీ ఆక్రమించిన భూములు పంచాలి’
హుస్నాబాద్: రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల మిగులు భూములుండగా.. వాటిని రామోజీరావుతో పాటు పలువురు ఆక్రమించుకున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు వేదకుమార్ ఆరోపించారు. ఈ భూములను సర్కారు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
వనరులను కాపాడుతామని చెప్పిన పార్టీలు..వాటిని దోచుకునేవారికి టికెట్లు ఇచ్చాయన్నారు. దేశంలో ఏడువందల మంది నేరస్తులు ఎంపీలుగా పోటీ చేస్తున్నారని, ఇందులో రెండు వందల మంది కార్పొరేట్లు ఉన్నారని, ఇలాంటి వారు గెలిస్తే వనరులను మరింతగా దోచుకుంటారని అన్నారు.
సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదానికి మద్దతు తెలిపినప్పటికీ జేఏసీ ఎందుకు మాట్లాడం లేదని, తెలంగాణ ఏర్పడిన తరువాత జేఏసీ ఎందుకని ప్రశ్నించారు. ఆదివాసులను ముంచుతున్న పోల వరం ప్రాజెక్టును నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకురాలు దేవేంద్ర పాల్గొన్నారు.