
సీతమ్మధారలోని 'ఈనాడు' కార్యాలయం ఖాళీ
విశాఖ : సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయాన్ని ఎట్టకేలకు ఆ సంస్థల అధినేత రామోజీరావు ఖాళీ చేస్తున్నారు. ఇందు కోసం నిన్న రాత్రి భారీ క్రేన్లు, 200మందికి పైగా పనివాళ్లను నియమించారు. మంగళవారం ఉదయం కార్యాలయం ఫెన్సింగ్ తొలగించి యంత్రాలను ఆటోనగర్కు తరలిస్తున్నారు. కాగా ఈ వివాదానికి సంబంధించి ఆర్సీసీ కోర్టులో నేడు వాయిదా ఉండి.
కాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయకపోతే పాత బకాయిల కింద రూ.2.60 కోట్లు, రెండు నెలల అద్దె రూపంలో రూ.34 లక్షలను ఫిబ్రవరి 10లోపు రామోజీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆలోపే భవనాన్ని ఖాళీ చేసి బయట పడాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, సిబ్బందికి ఆ మేరకు ఆదేశాలిచ్చారని తెలిసింది.