ఆ దేవుడి ఆశీస్సులతో సీఎం త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు | Tollywood Actor Mohan Babu Tweet On CM YS Jagan Mohan Reddy Recovery | Sakshi
Sakshi News home page

Mohan Babu: సీఎం జగన్ మరింత ఉత్సాహంతో తిరిగి రావాలి: మోహన్ ‍బాబు ట్వీట్

Published Sun, Apr 14 2024 10:27 AM | Last Updated on Sun, Apr 14 2024 10:49 AM

Tollywood Actor Mohan Babu Tweet On CM YS Jagan Mohan Reddy Recovery - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత నూతన శక్తితో తిరిగిరావాలని కోరారు. రాబోయే రోజుల్లో మీ పనులను మళ్లీ విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. 

మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' ఎన్నికల ప్రచారంలో గాయపడిన సీఎం వైఎస్‌ జగన్ త్వరగా కోలుకోవాలి. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి. మీరు త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలి. మరింత నూతన ఉత్సాహంతో మీ విధులను పునఃప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం  నిర్వహిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో గాయపడిన సంగతి తెలిసిందే. 

మోహన్  బాబు తనయుడు మంచు విష్ణు సైతం సీఎం జగన్‌ త్వరగా  కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విష్ణు ట్వీట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement