ర్యాగింగ్ వలన కలిగే పరిణామాలపై విద్యార్థులకు వివరిస్తున్న తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదు
Published Thu, Aug 11 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
– యాజమాన్యాలు స్పందించకున్నా శిక్షార్హులే
– విద్యార్థులు ఆత్మన్యూతనకు లోనుకాకూడదు
– అవగాహన సదస్సులో అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి
తిరుపతి ఎడ్యుకేషన్ : ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి హెచ్చరించారు. రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ర్యాగింగ్, దాని పర్యవసనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దష్టి సారించాలన్నారు. సరదా కోసం తోటి విద్యార్థిని మానసికంగా, శారీరకంగా బాధపెడితే ఉన్నతమైన జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల విజయవాడలో 7వ తరగతి విద్యార్థి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే వెంటనే తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యం దష్టికి తీసుకెళ్లాలని సూచించారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మన్యూనతకు గురికాకూడదని, ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ దేశంలో మహిళా సాధికారతను పెంపొందించడానికి విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మల్లికార్జునయ్య, ఆర్ అండ్ డి సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.మోహన్, టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ పి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ నాగమునెయ్య పాల్గొన్నారు.
Advertisement