రంగరాయలో ర్యాగింగ్‌ కలకలం | Ragging at Rangaraya Medical College | Sakshi
Sakshi News home page

రంగరాయలో ర్యాగింగ్‌ కలకలం

Published Mon, Nov 11 2024 5:04 AM | Last Updated on Mon, Nov 11 2024 6:49 PM

Ragging at Rangaraya Medical College

కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్యకళాశాల (ఆర్‌ఎంసీ)లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. హౌస్‌ సర్జన్‌ తన జూనియర్లకు ర్యాగింగ్‌ పేరుతో శ­నివారం అర్ధరాత్రి ప్రత్యక్ష నరకం చూపాడు.  శ్రీకాకుళానికి చెందిన జగదీశ్‌ ఆర్‌ఎంసీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఇంటర్న్‌ చేస్తున్నాడు. ఆర్‌ఎంసీ పీజీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. 

శని­వారం అర్ధరాత్రి మద్యం తాగి ఆర్‌ఎంసీ మెన్స్‌ హా­స్టల్‌లోకి చొరబ­డ్డాడు. రాత్రి ఒంటిగంటకు హాస్టల్‌ గదుల్లోకి ప్రవేశించి, రెండో సంవత్సరం చదువు­తు­న్న పలువురు వైద్య విద్యార్థులను నిద్ర లేపా­డు. 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్‌లోకి తీసుకొచ్చి, నిల­బడాలని ఆదేశించాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవా­రుజా­మున 5 వరకూ ప్రత్యక్ష నరకం చూపించాడు. వికృత చేష్టలు చేయాలంటూ వేధించాడు. వారి­లో ఎదురు తిరి­గిన ముగ్గురు జూనియర్లపై చేయి చేసుకున్నాడు. 

బాధిత విద్యార్థుల్లో పలువురు ఆది­వారం తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసు­కున్నారు. దీంతో వారు కళాశాల యాజమా­న్యానికి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఈ ఫిర్యాదుపై యాజమాన్యం స్పందించింది. మద్యం తాగి, హా­స­్టల్‌లోకి చొరబడి ర్యాగింగ్‌ పేరుతో జూని­యర్లను వేధించిన విద్యార్థిని జగదీశ్‌గా గుర్తించింది. ఈ విషయాన్ని యాంటీ ర్యాగింగ్‌ కమి­టీకి నివేదించింది. జగదీశ్‌పై సోమవారం చర్యలు తీసుకోనుంది. 

Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement