ఐజీ సునీల్‌ నాయక్‌కు.. హైకోర్టు ఊరట | Bihar IG Sunil Nayak Gets Relief From AP High Court, Non Bailable Warrant Withdrawn | Sakshi
Sakshi News home page

ఐజీ సునీల్‌ నాయక్‌కు.. హైకోర్టు ఊరట

Mar 2 2026 9:30 PM | Updated on Mar 3 2026 11:57 AM

IG Sunil Nayak gets relief from AP High Court

సాక్షి విజయవాడ: బిహార్‌ ఐజీ సునీల్‌ నాయక్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సునీల్‌ నాయక్‌ని అరెస్టు చేయెుద్దని కోర్టు ఆదేశించింది. చట్టానికి లోబడే విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా కొద్దిసేపటి క్రితం  బిహార్‌ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

ఈ కేసులో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్‌ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్‌ కోర్టును పోలీసుల ఆశ్రయించారు దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది.  గుంటూరు స్పెషల్‌ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్‌ నాయక్‌ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement