మౌలిక సదుపాయాలు కల్పించండి
Published Thu, Jan 16 2014 4:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయూలని సాంఘిక సం క్షేమ శాఖాధికారులను ఆ శాఖ కమిషర్ జయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆమె డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహాల్లోనిమరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక ప్రణాశికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రూ. 400 కోట్లతో వసతిగృహాలకు సొంత భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రెండేళ్లల్లో అన్ని వసతిగృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ప్రతి కళాశాల బయోమెట్రిక్ పాస్ మిషన్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆధార్ నంబ ర్లు లేని విద్యార్థుల వద్ద ఈఐడీ తీసుకుని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఆధార్ సీడింగ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. ఇ టీవల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి లబ్ధిదారుల డేటాను మేపింగ్ చేయడానికి తగు సూచనలు జారీ చేశామని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ సీడింగ్‌లో వ్యత్యాసాలు ఉ న్నాయని, కళాశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎన్‌రోల్ చేయించుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల నిర్మాణానికి సంబంధించి భూ పరిపాలనా శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు గుర్తింపు, సేకరణకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. జిల్లాలో 7 వసతిగృహాలు అద్దె భవనాల్లో ఉండగా, అందులో ఐదు వసతిగృమాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణాలకు చెందిన సాంఘి క సంక్షేమ ఉప సంచాలకులు, కె. అచ్యుతానంద గుప్త, శ్రీనివాసన్, ఆదిత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement