Residential hostels
-
సంక్షేమ హాస్టళ్లు ఇక మరింత క్షేమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. హాస్టళ్లలో ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ‘సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్ విధానం (ఎస్ఓపీ)ని అమలులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అవసరమైన మార్గదర్శకాలను అన్ని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా హాస్టళ్లను పర్యవేక్షించేలా క్యాలెండర్ (టైమ్ టేబుల్)ను నిర్దేశించింది. వసతి గృహాల్లో విద్యార్థులకు రక్షణ, భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలోను అప్రమత్తం చేసింది. సురక్షితమైన ఆహారం, నీరుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హాస్టళ్ల పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్న పక్షంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలు ఇవీ.. ► వసతి గృహాలకు నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బంది స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉండాలి. ఒకవేళ క్వార్టర్స్ అందుబాటులో లేకపోతే సమీపంలోనే నివాసం ఉండాలి. ► అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి సంబంధిత ఉద్యోగులు పూర్తి చిరునామాలు, ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లను హాస్టల్ రిజిస్టర్, నోటీస్ బోర్డుల్లో ఉంచాలి. ► జాబ్ చార్ట్‌లోని విధుల పట్ల అలక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ► క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కచ్చితంగా హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలి. ► అధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు, వ్యవస్థాపకులు ఎవరైనా హాస్టళ్లను సందర్శించినప్పుడు వారి వివరాలు, చర్చించిన అంశాలను విజిటర్స్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ► విద్యార్థులకు భోజన మెనూ, సౌకర్యాలు, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ, సురక్షితమైన మంచినీరు, మెస్ కమిటీ, పేరెంట్స్ కమిటీ వంటి కీలక విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సక్రమంగా వినియోగించుకుని ప్రతి నెల రెండో శనివారం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలి. ► వారానికి ఒకసారి వైద్య ఆరోగ్య సిబ్బంది స్వయంగా హాస్టల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. -
హాస్టల్లో విద్యార్థుల బీర్ల విందు! వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు వైరల్
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీ ఫొటోలు వైరల్ కావడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సా ప్తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. (చదవండి: ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..) ఇళ్ల మధ్యలో ఉండటంతోనే..? వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని అందులో నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానికంగా ఉండే తోటి విద్యార్థులు వీరికి బీరుబాటిళ్లు తెచ్చి ఇవ్వడంతోపాటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే చర్చ జరుగుతోంది. కాగా, వాచ్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. వార్డెన్ లక్సెట్టిపేట నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువైంది. ఆ రోజు సాయంత్రం వార్డెన్ త్వరగానే వెళ్లిపోయినట్లు తెలిసింది. (చదవండి: పీసీసీలో ‘పీకే’ ఫీవర్! అలా అయితే ఎలా?) -
Telangana: విద్యార్థుల ‘వసతి’కి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థులకు శుభవార్త. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతిగృహాలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. విద్యా సంస్థలను ప్రారంభించినప్పటికీ వసతిగృహాలను తెరవకపోవడంతో విద్యార్థులకు బస ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు హాస్టళ్లలో డబ్బులు చెల్లించి వసతి పొందుతుండగా.. మరికొందరు రోజువారీ తరగతులకు హాజరు కాకుండా ఇంటివద్దనే ఉంటున్నారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను వివరిస్తూ విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లు, పోస్టుమెట్రిక్ హాస్టళ్లను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతిగృహాలు తెరిచేందుకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ఈ దిశలో ఆదేశాలు జారీ చేయనున్నాయి. దసరా సెలవుల తర్వాత హాస్టళ్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,750 వసతి గృహాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతి గృహాలున్నాయి. ఇందులో 650 కళాశాల విద్యార్థి వసతిగృహాలు కాగా మిగతావి పాఠశాల విద్యార్థుల వసతిగృహాలు. ఈ వసతిగృహాల పరిధిలో 2.27 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వసతిగృహాలన్నీ మూతబడ్డాయి. గత ఏడాది మార్చి రెండో వారంలో ఈ హాస్టళ్లు మూతబడగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నెలరోజుల పాటు తాత్కాలికంగా తెరిచారు. తిరిగి కోవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో మూసివేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు దసరా సెలవుల తర్వాత తిరిగి హాస్టళ్లకు చేరుకోనున్నారు. -
అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్
కరువుకు నిలయం అనంత. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతే. అందుకే బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లే దిక్కు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి విద్యార్థులకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆ మేరకు తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. అక్కడే రాత్రి బస చేస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తూ.. మెరుగైన వసతి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సాక్షి, అనంతపురం : విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అకస్మిక తనిఖీలు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల హాజరు, భోజనం నాణ్యత, మెనూ అమలు.. హాస్టల్ వార్డెన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఐదుగురు వార్డెన్లపై ఇప్పటికే వేటు వేశారు. అయినప్పటికీ మిగతా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సస్పెండ్ చేయడం.. కొద్దిరోజుల తర్వాత దాన్ని ఎత్తివేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కలెక్టర్ కొత్త పంథా ఎంచుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా ఇంక్రిమెంట్ల కోతకు చర్యలు తీసుకుంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చిన తర్వాత(విత్/వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్) ఒకటి లేక రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఏఎస్డబ్ల్యూఓ ప్రసాద్, చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మారుతీరావు, కుక్ నారాయణమ్మ, బీకేఎస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూడేరు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ కేఆర్ శశికళకు చార్జెస్ ఫ్రేం చేశారు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ⇔ చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్‌ను ఈనెల 7న కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 55 మంది పిల్లలకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. 29 మంది గైర్హాజరయ్యారు. వినాయక చవితి పండుగకు వెళ్లిన వారు ఇంకా రాలేదని వార్డెన్ ఇచ్చిన సమాధానంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ 3వ తేదీ అయితే 7వ తేదీ వరకు రాకపోయినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా పప్పులో ఉప్పు ఎక్కువైందనీ, సాంబారులో నీళ్లు తప్ప కూరగాయలు కనిపించలేదని.. పైగా పప్పులో రాళ్లు కనిపించాయన్నారు. తనకు వడ్డించిన అన్నంలోనే రాయి వచ్చిందన్నారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ చేయాల్సి ఉన్నా..నీళ్ల చారుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ ఇక ఈనెల 3న కలెక్టర్ బుక్కరాయసముద్రంలో ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించారు. 130 మందికి గాను కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కలెక్టర్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ పనితీరు మార్చుకుని ప్రభుత్వ ప్రాధాన్యామాలకు అనుగుణంగా పనిచేయాలని లేకపోతే ఇంటికి పంపించేందుకు కూడా వెనకాడేది లేదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడిన వార్డెన్లు ►రామునాయక్, అనంతపురం ఎస్సీ నంబర్–4 హాస్టల్ వార్డెన్ ►బాబు, బుక్కరాయసముద్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ ►వెంకటేశ్వర్లు, ఎస్టీ హాస్టల్ వార్డెన్ ►ఠాగూర్, గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు బీసీ హాస్టల్ వార్డెన్ (వీరిలో రామునాయక్, ఠాగూర్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.) -
వసతిగహం తరలింపుపై ప్రజాగ్రహం
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన విద్యార్థులు, ప్రజలు అధికారులను నిలదీసి.. నిరసన తెలిపిన వైనం అనుమసముద్రంపేట : మండలంలోని గుంపర్లపాడులో ఉన్న బీసీ బాలుర వసతిగహాన్ని ఆత్మకూరు గిరిజన సంక్షేమ వసతిగహంలో మెడ్జ్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి సంజీవరావు తల్లిదండ్రులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వసతిగహాలు ఏర్పాటు చేసిందన్నారు. ఆత్మకూరులో అన్నీ వసతులతో కూడిన భవనం నిర్మించారని, అందులోకి ఈ వసతిగహాన్ని మెడ్జ్ చేస్తున్నట్లు చెప్పారు. వద్దే వద్దు.. వసతిగహం తరలింపునకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు. ఉన్న హాస్టల్‌ను తొలగించడం ఏంటని అధికారులను నిలదీశారు. వసతిగహంలో అనేకమంది డ్రాపౌవుట్స్ను తీసుకువచ్చి చేర్పించారని, వందమందికిపైగా ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో చదువుతున్నారని వాపోయారు. హాస్టల్ తరలిస్తే మళ్లీ చిన్నారులు బడిమానేస్తారని అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వసతిగహాలు ఏర్పాటుచేసి విద్య అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఉన్న గహాలను తొలగించడం ఎంతవరకు సమంజసమని అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా వసతిగహం ఉందని దీనిని తరలించడం మాని మెరుగైన సౌకర్యాల కల్పనకు కషిచేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు వారు వసతిగహం తొలగించడానికి వీలులేదని ఏకగ్రీవంగా తీర్మానించి అర్జీలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూఓ నరసారెడ్డి, ఏఎస్‌పేట, గుంపర్లపాడు వార్డెన్లు మహబూబ్‌బాష, రాజగోపాల్, సర్పంచ్ స్రసాద్, మాజీ సర్పంచులు నరసారెడ్డి, రత్నం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలు కల్పించండి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయూలని సాంఘిక సం క్షేమ శాఖాధికారులను ఆ శాఖ కమిషర్ జయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆమె డీఆర్డీఏ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహాల్లోనిమరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక ప్రణాశికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రూ. 400 కోట్లతో వసతిగృహాలకు సొంత భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రెండేళ్లల్లో అన్ని వసతిగృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్లైన్లో ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ప్రతి కళాశాల బయోమెట్రిక్ పాస్ మిషన్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆధార్ నంబ ర్లు లేని విద్యార్థుల వద్ద ఈఐడీ తీసుకుని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఆధార్ సీడింగ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. ఇ టీవల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి లబ్ధిదారుల డేటాను మేపింగ్ చేయడానికి తగు సూచనలు జారీ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ సీడింగ్‌లో వ్యత్యాసాలు ఉ న్నాయని, కళాశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎన్రోల్ చేయించుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల నిర్మాణానికి సంబంధించి భూ పరిపాలనా శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు గుర్తింపు, సేకరణకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. జిల్లాలో 7 వసతిగృహాలు అద్దె భవనాల్లో ఉండగా, అందులో ఐదు వసతిగృమాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణాలకు చెందిన సాంఘి క సంక్షేమ ఉప సంచాలకులు, కె. అచ్యుతానంద గుప్త, శ్రీనివాసన్, ఆదిత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.