‘మాయామహల్’లో ఏం జరిగింది? | 'Maya Mahal' releasing on June 25th | Sakshi
Sakshi News home page

‘మాయామహల్’లో ఏం జరిగింది?

Published Fri, Jun 13 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

‘మాయామహల్’లో ఏం జరిగింది?

‘మాయామహల్’లో ఏం జరిగింది?

అదొక మాయామహల్. ఆ మహల్‌లోకి అడుగుపెట్టినవారు ఎలాంటి అనుభూతులకు గురవుతారు? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అనే కథాంశంతో మోక్షగుండం జయలక్ష్మి సమర్పణలో మోక్షగుండం అంకయ్య నిర్మించిన చిత్రం ‘మాయామహల్’. టీయస్ రాజు, గ్రీష్మ జంటగా నటించిన ఈ చిత్రానికి సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రేమ, వినోదం సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా. నిర్మాతగా మా ఈ తొలి ప్రయత్నం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement