చెన్నైలో వ్యభిచార ముఠా గుట్టురట్టు | sex racket in chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Jul 14 2018 3:16 AM | Updated on Oct 22 2018 6:13 PM

sex racket in chennai - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: సామాజిక మాధ్యమాల సాయంతో చెన్నైలో నడుస్తున్న భారీ సెక్స్‌ రాకెట్‌ బట్టబయలైంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులకు వలవేస్తూ వ్యభిచార సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు యువకులను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై అన్నానగర్‌లో నివసించే తమిళ సినీ, టీవీ సీరియల్‌ నటి జయలక్ష్మి ఇటీవల నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ‘రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌’ పేరుతో కొన్నిరోజులుగా 2 నంబర్ల నుంచి తన వాట్సప్‌కు అసభ్యకర సందేశాలు వస్తున్నాయని చెప్పారు.

‘మీరు డేటింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారా. మీతో రావడానికి వీఐపీలు సిద్ధం. రూ.30 వేలు మొదలుకుని రూ.3లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ వంటి సందేశాలు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టి చెన్నై విరుగంబాక్కంలో ఉండే మురుగ పెరుమాన్, కవియరసన్‌ అనే యువకులే ఈ సందేశాలు పంపుతున్నట్లు తెలుసుకున్నారు. వీరిని అరెస్ట్‌ చేశారు.

ఆ నటి రేటు రూ.40 లక్షలు
అరెస్టయిన ఈ ఇద్దరి సెల్‌ఫోన్లను పరిశీలించి అందులోని ఫొటోలను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ప్రముఖ తమిళ నటీమణుల ఫొటోలు, వారి రేట్లు ఉన్నాయి. తమిళ సినిమారంగంలో పేరొందిన ఒక ప్రముఖ యువ నటి పేరు, ఆమెతో సమయం గడిపేందుకు రూ. 40 లక్షలు చెల్లించాలని ఓ విటుడికి మెసేజ్‌ పెట్టారు. సుమారు 70 మంది యువతుల అసభ్య ఫొటోలను పలువురికి పంపి రేటు ఫిక్స్‌చేశారు. ఈ వాట్సప్‌ చాటింగ్‌ను పోలీసులు సేకరించారు. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి సేవలు పొందుతున్న రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరు? వీరికి అండగా పెద్దలెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement