అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్‌ | Tollywood Director Sailesh Kolanu Responds On Vaccine Rumours | Sakshi
Sakshi News home page

Sailesh Kolanu: ప్రశాంతంగా ఉండండి.. వాటిని పట్టించుకోవద్దు: శైలేశ్ కొలను

Published Tue, Apr 30 2024 7:59 PM | Last Updated on Tue, Apr 30 2024 9:06 PM

Tollywood Director Sailesh Kolanu Responds On Vaccine Rumours

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్‌ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్‌ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్‌ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్‌ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు.

 ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్‌ ప్రభావం గురించి ఓ క్లిప్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్‌ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement