Director Sailesh Kolanu Surprise His Fan - Sakshi
Sakshi News home page

Sailesh Kolanu: అభిమాని ఇంటికి వెళ్లిన డైరెక్టర్‌, అమ్మ పునుగులు తినిపించిందంటూ ట్వీట్‌

Published Fri, May 5 2023 11:38 AM | Last Updated on Fri, May 5 2023 12:09 PM

Sailesh Kolanu Surprise His Fan - Sakshi

శైలేష్‌ కొలను.. తొలి సినిమా హిట్‌తోనే ఇండస్ట్రీలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. హిట్‌​ చిత్రంతో విజయాన్ని అందుకున్న అతడు హిట్‌ 2: ది సెకండ్‌ కేస్‌తో మరోసారి సక్సెస్‌ రుచి చూశాడు. నానితో మూడో సీక్వెల్‌ తెరకెక్కిస్తాడనుకునేలోపే విక్టరీ వెంకటేశ్‌తో సైంధవ్‌ సినిమాను ట్రాక్‌ ఎక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన డైరెక్టర్‌ తాజాగా  ఓ అభిమాని ఇంటికి వెళ్లి సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై బయలు దేరిన డైరెక్టర్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసిన ఓ అభిమాని తన ఇంటికి టిఫిన్‌ చేసేందుకు రావాలంటూ ఆహ్వానించాడు. దీంతో డైరెక్టర్‌ మరేం ఆలోచించకుండా అతడి ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ సందర్భంగా అతడితో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

'ఇతడి పేరు పవన్‌. నేను హైదరాబాద్‌ వస్తున్నానని తెలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేసేందుకు తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ మెసేజ్‌ పెట్టాడు. నేను నిజంగా అతడి ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదినీ సర్‌ప్రైజ్‌ చేశాను. ఎంత అందమైన కుటుంబమో.. పవన్‌ అమ్మ నాకు పునుగులు తినిపించింది. చాలా రుచికరంగా ఉన్నాయి. అమ్మ వెంకీ మామ ఫ్యాన్‌ తెలిసి థ్రిల్లయ్యాను. తను సైంధవ్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూస్తానని చెప్పడంతో నాకు చాలా సంతోషం వేసింది' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: సెల్వ రాఘవన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement