సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్‌గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు.
విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్‌ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! )
ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్)
కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?)
At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie
— Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024
Comments
Please login to add a commentAdd a comment