Muthu Film
-
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
20 ఏళ్ల తర్వాత రీరిలీజ్.. స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్!
ఆరంభ దశలో కమలహాసన్, రజనీకాంత్ కలిసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు విడివిడిగా కథానాయకులుగా నటించడం మొదలెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరి చిత్రాల మధ్య పోటీ నెలకొనేది. ఆ తర్వాత ఇద్దరి సినిమాలను ఒకేసారి విడుదల చేయకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. అలాంటిది కమల్ హాసన్ నటించిన ఆళవందాన్, రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రాలు ఒకేరోజు విడుదలై బాక్సాఫీస్ వద్ద ఢీకొన్నాయి. కమల్ హాసన్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఆళవందాన్. 22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ మనీషా కొయిరాలా, రవీనా టండన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ భారీ యాక్షన్ కిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం 2001లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని నిర్మాత థాను కొత్త హంగులతో డిజిటల్ ఫార్మెట్లో రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల చేశాడు. జపాన్‌లోనూ సెన్సేషనల్ హిట్ ఇకపోతే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ముత్తు. మీనా కథానాయికగా నటించిన ఇందులో శరత్‌బాబు, రాధారవి, సెంథిల్ ముఖ్యపాత్రలు పోషించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1995లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అనూహ్య విజయాన్ని సాధించడంతోపాటు జపాన్‌లోనూ రజనీకాంత్‌కు బోలెడంత అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ నటించిన ఆళవందాన్, రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రాలు శుక్రవారం రీ రిలీజ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది. அம்மா தாய்மாரே ஆபத்தில் விடமாட்டேன்! இது வெறும் சொல் மட்டும் அல்ல செயல்!! நேற்று தலைவர் அவர்களின் முத்து திரைப்படம் ரீ-ரிலீஸ் கொண்டாட்டத்தில் தலைவரின் தீவிர ரசிகர்களான பெண் ஆட்டோ ஓட்டுனர்கள்!!! 🙏@KavithalayaaOff @NikileshSurya #MuthuReRelease pic.twitter.com/GRqem2YjSX — SUNDAR MAHALINGAM (@mahalaingam) December 9, 2023 Masterclass for mass opening scenes. #Aalavandhan mass intro sequence with Aandavars word play is goosebumps. Audience are cheering and clapping for every dialogue and every nuances. Don't miss it in theatres. #AalavandhanRemastered #KamalHaasan𓃵 #AalavandhanRemastered pic.twitter.com/GiOHia0k4C — Thirukumaran (@Cine_Maniac_TK) December 8, 2023 చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం! -
ముత్తు మళ్లీ వస్తున్నాడు
పాతికేళ్ల క్రితం రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘ముత్తు’ (1995) ఒకటి. రజనీకాంత్ మాస్ యాక్షన్, కామెడీ, చిత్రకథానాయిక మీనాతో ‘థిల్లానా.. థిల్లానా..’ అంటూ చేసిన డ్యాన్స్ ఆయన అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ముత్తు’ మళ్లీ తెరపైకి రానున్నాడు. డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా పది రోజుల ముందు (డిసెంబర్ 2) ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక.. ఈ నాలుగుప్రాంతాల్లోని థియేటర్లలో ‘ముత్తు’ మళ్లీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రజనీ బ్లాక్‌బస్టర్ మూవీ.. అక్కడ మళ్లీ రిలీజ్!
ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న సంగతి తెలిసిందే. తలైవా అంటూ ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. రజనీ సినిమా విడుదలవుతుందంటే వారు చేసే హంగామానే వేరు. రజనీకి సింగపూర్, మలేషియా, జపాన్‌లాంటి దేశాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్, మీనా జంటగా నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికీ అక్కడ ఈ చిత్రానికి ఆదరణ తగ్గలేదు. అయితే ఈ చిత్రం జపాన్‌లో విడుదలై ఇరవై యేళ్లు గడిచిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను 4కె, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సౌండ్ ఎఫెక్ట్స్‌తో నవంబర్ 23న రీరిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జపాన్‌లో రజనీని డ్యాన్సింగ్ కింగ్ అని, మీనాను డ్యాన్సింగ్ క్వీన్ అని ఫ్యాన్స్ సంభోదిస్తుంటారట. -
శ్రీదేవి పేరుతో జపాన్ వంటకం
అతిలోకసుందరి శ్రీదేవి పేరుతో జపాన్‌లో ఒక వంటకం తయారవుతుందంటే నమ్ముతారా? అయితే ఇది నిజం. ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పేరు ఇప్పుడు జపాన్‌లోనూ మార్మోగుతోంది. ఆమెకు అక్కడ అభిమానగణం తయారయ్యింది. దక్షిణాదికి చెందిన హీరోలలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జపాన్‌లో పలు అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ముత్తు చిత్రం జపాన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అప్పటి నుంచి రజనీ జపాన్‌లో పాపులర్ హీరో అయ్యారు. ముత్తు చిత్రం తరువాత రజని నటించిన ప్రతి చిత్రం జపాన్‌లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తరహాలో ఇప్పుడు నటి శ్రీదేవి కూడా జపాన్ సినీ ప్రేక్షకుల అభిమాన పాత్రురాలయ్యారు. ఆమె నటించిన ఇంగ్లిష్ - వింగ్లిష్ చిత్రం జపాన్ భాషలోకి అనువాదం అయి ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన శ్రీదేవి ఆ దేశ ప్రధాని భార్య అహిఅభిని కలిశారు. ఆమె కోసం ఇంగ్లిష్ - వింగ్లిస్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రాన్ని చూసిన పలువురు జపనీయులు శ్రీదేవి అభిమానులైపోయారు. అంతేకాదు ఇంగ్లిష్ - వింగ్లిస్ చిత్రంలో శ్రీదేవి పాత్ర పేరు శశి. ఇప్పుడా పేరుతో జపాన్‌లోని ఒక హోటల్లో వంటకం భోజన ప్రియులకు నోరూరిస్తోంది. అలాగే కొన్ని స్వీట్స్ కూడా శశి పేరుతో హల్చల్ చేస్తున్నాయట. దీంతో దటీజ్ అతిలోక సుందరి ఫవర్ అంటున్నారు దక్షిణాది సినీ ప్రముఖులు