శ్రీదేవి పేరుతో జపాన్ వంటకం | japan recipe with sridevi name | Sakshi
Sakshi News home page

శ్రీదేవి పేరుతో జపాన్ వంటకం

Published Sat, Jun 21 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

శ్రీదేవి పేరుతో జపాన్ వంటకం

శ్రీదేవి పేరుతో జపాన్ వంటకం

అతిలోకసుందరి శ్రీదేవి పేరుతో జపాన్‌లో ఒక వంటకం తయారవుతుందంటే నమ్ముతారా? అయితే ఇది నిజం. ఎవర్‌గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పేరు ఇప్పుడు జపాన్‌లోనూ మార్మోగుతోంది. ఆమెకు అక్కడ అభిమానగణం తయారయ్యింది. దక్షిణాదికి చెందిన హీరోలలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జపాన్‌లో పలు అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన ముత్తు చిత్రం జపాన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అప్పటి నుంచి రజనీ జపాన్‌లో పాపులర్ హీరో అయ్యారు.

ముత్తు చిత్రం తరువాత రజని నటించిన ప్రతి చిత్రం జపాన్‌లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తరహాలో ఇప్పుడు నటి శ్రీదేవి కూడా జపాన్ సినీ ప్రేక్షకుల అభిమాన పాత్రురాలయ్యారు. ఆమె నటించిన ఇంగ్లిష్ - వింగ్లిష్ చిత్రం జపాన్ భాషలోకి అనువాదం అయి ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన శ్రీదేవి ఆ దేశ ప్రధాని భార్య అహిఅభిని కలిశారు.

ఆమె కోసం ఇంగ్లిష్ - వింగ్లిస్ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రాన్ని చూసిన పలువురు జపనీయులు శ్రీదేవి అభిమానులైపోయారు. అంతేకాదు ఇంగ్లిష్ - వింగ్లిస్ చిత్రంలో శ్రీదేవి పాత్ర పేరు శశి. ఇప్పుడా పేరుతో జపాన్‌లోని ఒక హోటల్‌లో వంటకం భోజన ప్రియులకు నోరూరిస్తోంది. అలాగే కొన్ని స్వీట్స్ కూడా శశి పేరుతో హల్‌చల్ చేస్తున్నాయట. దీంతో దటీజ్ అతిలోక సుందరి ఫవర్ అంటున్నారు దక్షిణాది సినీ ప్రముఖులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement