Mitsubishi Company
-
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
జపాన్ టు ఇండియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) ఎంట్రీ, సక్సెస్‌తో విదేశీ కంపెనీల్లో ఉత్సాహం నెలకొంది. వాణిజ్య స్థిరాస్తి రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భారత స్థిరాస్తి రంగంలోకి అమెరికా, కెనడా దేశాల కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌కు చెందిన పలు రియల్టీ కంపెనీలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎంబసీతో మిట్సుబిషి చర్చలు.. జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్, సుమిటోమో కార్పొరేషన్, మిట్సుయి గ్రూప్, మోరీ బిల్డింగ్స్ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ, పారిశ్రామిక పార్క్‌ల నిర్మాణానికి ఆసక్తి ఉన్నట్లు తెలిసింది. మిట్సుబిషీ నుంచి ముగ్గురు, సుమిటోమో నుంచి 810 మంది ఇండియన్ ప్రతినిధులు కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం పనిచేస్తున్నారు. మిట్సుబిషి, సుమిటోమో కార్పొరేషన్స్ దీర్ఘకాలం పాటు భారీ అద్దెలు వచ్చే కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కొనేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణం కోసం మిట్సుబిషి కార్పొరేషన్ బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌తో చర్చలు జరుపుతుంది. ఎంబసీతో పాటూ స్థానికంగా ఉన్న మరిన్ని కంపెనీలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మిట్సుబిషీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ చెన్నై ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమిటోమి ఎంట్రీ.. గత సెప్టెంబర్‌తో మిట్సుబిషీ, సింగపూర్ ప్రభుత్వ కంపెనీ టీమాసీక్ హోల్డింగ్ అనుబంధ సంస్థ సుర్బానా జురోంగ్ సంయుక్తంగా కలిసి ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో అర్బన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో 2.5 బిలియన్ డాలర్లతో రైల్, రోడ్స్, హౌజింగ్, షాపింగ్ సెంటర్స్, ఆసుపత్రులు వంటి పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేసింది. ఇండియాతో పాటూ మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల్లో ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తుంది. సుమిటోమో రియల్టీ అండ్ డెవలప్మెంట్ కంపెనీ స్థానికంగా ఇండియన్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్‌గా కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తుంది. గతేడాది సుమిటోమో ఎన్సీఆర్లో మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి ఆటో పరికరాల తయారీ సంస్థ కృష్ణ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 90 శాతం పెట్టుబడులు విదేశీ కంపెనీలవే.. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ) కంపెనీలు భారత స్థిరాస్తి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్ కంపెనీలు వాణిజ్య రియల్టీ రంగంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి కూడా. 2018లో రియల్టీ రంగంలోకి సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 44 శాతం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా, కెనడా, సింగపూర్ వంటి విదేశీ కంపెనీల నుంచి వచ్చినవే. 90 శాతం విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినవేనని కేపీఎంజీ తెలిపింది. రీట్స్, రెరా, జీఎస్టీలతో రెడ్ కార్పెట్.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రియల్టీ రంగంలో లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కేంద్రం గత 34 ఏళ్లలో విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ల అమలుతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొందని.. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. భారత వాణిజ్య స్థిరాస్తి రంగం దీర్ఘకాల పె ట్టుబడులు, రిటర్న్స్‌కు సరైన ప్రాంతమని, అందుకే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అనరాక్ క్యాపిటల్ ఎండీ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఇలా... ► జపాన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ సుజుకీ మోటర్ కార్పొరేషన్ 1981లో తొలిసారిగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. నాటి నుంచి 2016 అక్టోబర్ వరకు మన దేశంలో 1305 జపాన్ కంపెనీలు నమోదయ్యాయి. ప్రధానంగా ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి, హెల్త్‌కేర్ రంగాల్లో ఉన్నాయి. ► 2013లో 16.31 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ► దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో జపాన్ వాటా 7 శాతం. ► 2000 నుంచి 2018 మధ్య కాలంలో జపాన్ నుంచి 27.28 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. ► 2017–18లో జపాన్ నుంచి ఇండియాకు 10.97 బిలియన్ డాలర్ల దిగుమతులు, మన దేశం నుంచి జపాన్‌కు 4.73 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ► 2007–08లో 6.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2017–18 నాటికి 10.97 బి.డాలర్లకు పెరిగాయి. అంటే 11 ఏళ్లలో దిగు మతుల్లో 73% వృద్ధి నమోదైంది. జపాన్ నుం చి ప్రధానంగా ఎలక్ట్రికల్ మిషనరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అనుబంధ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు దిగుమతి అవుతుంటాయి. -
ఉద్యోగం నుంచి తీసేసారని
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగంలోంచి తీసేసారన్న అక్కసుతో ఏకంగా కంపెనీ ఉన్నతోద్యోగిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఉన్నతాధికారిపై హత్యాయత్నం చేశాడు. అయితే సదరు అధికారి తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకోవడంతో కంపెనీ ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చు కున్నారు. జర్మనీ లగ్జరీ కారు మేకర్ మిత్సుబిషి కంపెనీ హెచ్ఆర్ హెడ్ బినిష్ శర్మపై ఈ దాడి జరిగింది. గుర్గావ్ కార్యాలయంలో గురువారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురువారం ఉదయం బినిష్ శర్మ కార్యాలయానికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కారు ఆపక పోవడమే కాకుండా వేగాన్ని మరింత పెంచారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిన బాధితుడిని రాక్లాండ్ ఆసుపత్రిలో చేర్చారు. బినిష్కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా శర్మని చంపాలనే లక్ష్యంతోనే దుండగులు కాల్పులు జరిపారని గుర్గావ్ పోలీస్ అధికారి రవీందర్ కుమార్ పిటిఐకి తెలిపారు. నిందితుల్లో ఒకరైన జోగిందర్ అనే వ్యక్తిని అనైతిక ప్రవర్తన ఆరోపణలతో బుధవారం విధులనుంచి తొలగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించారు. కానీ శర్మ ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామనీ, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
3 గ్రామాలకు మహర్దశ
దివిసీమలోని పల్లెలను దత్తత తీసుకున్న ‘మిత్సుబిషి’ రూ.7.9 కోట్లతో ‘స్మార్ట్’గా అభివృద్ధి 2,200 కుటుంబాలకు లబ్ధి ముఖ్యమంత్రి, మిత్సుబిషి కంపెనీ చైర్మన్ వెల్లడి విజయవాడ : జిల్లాలోని నాగాయలంక మండలం సొర్లగొంది, నాలి, చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఈ గ్రామాలను జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ దత్తత తీసుకుంది. స్థానిక ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో మూడు గ్రామాలతో పాటు వాటి శివారు గ్రామాలను మిత్సుబిషి కంపెనీ స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దే శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఆయా గ్రామాల ప్రజలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రూ.7.9 కోట్లతో అభివృద్ధి దివిసీమకు వచ్చిన ఉప్పెనలో సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. సొర్లగొంది, నాలి గ్రామాలతో పాటు మరో నాలుగు శివారు గ్రామాలు సముద్రం ఒడ్డున ఉంటాయి. ఈ గ్రామాల్లో ఎక్కువమంది మత్స్యకారులే జీవిస్తారు. మంగళాపురం వ్యవసాయదారుల గ్రామం. దీనికి మరో శివారు గ్రామాన్ని కలిపి మొత్తం ఎనిమిది గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మిత్సుబిషి కంపెనీ ముందుకొచ్చింది. ఈ గ్రామాల్లో 2,200 కుటుంబాలు ఉంటాయి. గ్రామాల అభివృద్ధికి కంపెనీ సుమారు రూ.7.9 కోట్లు ఖర్చు చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత నిర్వహించడంలో భాగంగా స్వామినాథన్ ఫౌండేషన్ సూచన మేరకు ఈ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి సముద్రతీర ప్రాంతాన్ని రక్షించేందుకు, మడ అడవుల పెంపకంపై స్వామినాథన్ ఫౌండేషన్ పనిచేస్తోంది. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు ఆయా గ్రామాల్లో ప్రజల జీవనశైలిలో మార్పులు తెచ్చేందుకు మిత్సుబిషి కంపెనీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని సమావేశంలో మిత్సుబిషి కంపెనీ చైర్మన్ మసకబు నకకిడ తెలిపారు. ఆయా గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, ప్రజలకు మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పిస్తారు. గ్రామస్తులు ఆర్థికంగా స్థిరపడేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. మత్స్యకారులు తమ ఉత్పత్తులు ఎక్కువ ధరలకు విక్రయించుకోవడంపై కూడా శిక్షణ ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మిత్సుబిషి కృషిచేస్తుంది. కోరాపుట్ అభివృద్ధిలో మిత్సుబిషి ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో మిత్సుబిషి, డాక్టర్ స్వామినాథన్ ఫౌండేషన్లు కలిసి పనిచేశాయి. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యవసాయ వారసత్వ వ్యవస్థగా పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించడం విశేషం. మనజిల్లాలోని ఈ మూడు ప్రాంతాలను కూడా ఈ రెండు సంస్థలు అద్భుతమైన స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతాయేమో వేచి చూడాలి.