'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు | A case in Madurai High Court on Linga Cinema | Sakshi
Sakshi News home page

'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు

Published Wed, Nov 12 2014 6:41 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు

'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు

చెన్నై: 'లింగా' సినిమా విడుదలపై స్టే కోరుతూ మధురై హైకోర్టు (బెంచ్)లో పిటిషన్ దాఖలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకం‌పై రాక్‌లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని రవి రత్నం అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా హీరో రజనీకాంత్తోపాటు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు పంపారు.

 కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు  ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.  ఈ సినిమాను రజనీ కాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న  విడుదల చేయనున్నారు.  ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్‌లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, న‌ర‌సింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement