Linga cinema
-
గ్రాఫిక్స్‌కి సమయం ఇవ్వలేదు!
హీరో రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్ రవికుమార్ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. -
'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు
చెన్నై: 'లింగా' సినిమా విడుదలపై స్టే కోరుతూ మధురై హైకోర్టు (బెంచ్)లో పిటిషన్ దాఖలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని రవి రత్నం అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా హీరో రజనీకాంత్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు పంపారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను రజనీ కాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ** -
లింగ షూటింగ్లో అపశ్రుతి
హైదరాబాద్ : రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న లింగ షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఫిల్మ్ సిటీలో బీఎస్ఎఫ్ షెడ్ నెం 8 వద్ద చిత్రం షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలో ఐదో అంతస్తుపైన ఉన్న లైట్ బాయ్ సుదర్శన్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన నగరంలోని ఆస్పత్రికి తరలించారు. రజనీకాంత్ హీరోగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.