లింగ షూటింగ్లో అపశ్రుతి | Light boy injured in Linga cinema shooting at Ramoji film city | Sakshi
Sakshi News home page

లింగ షూటింగ్లో అపశ్రుతి

Published Fri, Oct 17 2014 11:33 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

లింగ షూటింగ్లో అపశ్రుతి - Sakshi

లింగ షూటింగ్లో అపశ్రుతి

హైదరాబాద్ : రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న లింగ షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఫిల్మ్ సిటీలో బీఎస్ఎఫ్ షెడ్ నెం 8 వద్ద చిత్రం షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలో ఐదో అంతస్తుపైన ఉన్న లైట్ బాయ్ సుదర్శన్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన నగరంలోని ఆస్పత్రికి తరలించారు.  రజనీకాంత్ హీరోగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్ హీరోగా అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా లింగ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement