సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ. 700 కోట్లు వసూలు చేసింది. 2. ఓనే కాకుండా గతంలో తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ భారత సిని చరిత్రలో రికార్డు సృష్టించాయి. వసూళ్ల పరంగా సునామీలా దూసుకు పోయాయి. మరో పక్క బాలీవుడ్‌లో భారీ అంచానలతో తెరకెక్కిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శేఖర్ కపూర్ ‘భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు ఎందుకు విజయవంతమవుతున్నారు.. ముంబై దర్శకులు ఎక్కడ ఫెయిలవుతున్నారు..? దక్షిణాది దర్శకులకు సినిమాలంటే చాలా పాషన్. అందుకే వారు బాహుబలి, బాహుబలి 2, 2 పాయింట్ ఓ వంటి భారీ చిత్రాలు తీయగలిగారు అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి, 2. ఓ వంటి చిత్రాలు భారతీయ సినిమాల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయని పొగిడారు. ఇదే సమయంలో హిందీ దర్శకులు ఇలాంటి ప్రయత్నాల్లో వెనకబడ్డారని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో సినిమాల మీద విపరీతమైన అభిమానం ఉన్నవారే ఇండస్ట్రీకి వస్తారంటూ వ్యాఖ్యానించారు.
Why are Directors from Southern India succeeding in large scale films where Directors in Mumbai are failing? Directors from the South certainly show far more passion in their film making. Like in #Bahubali #Bahubali2 #2Point0
— Shekhar Kapur (@shekharkapur) December 12, 2018
గతంలో కరణ్ జోహర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ‘బాహుబలి 2 : ది కంక్లూజన్’ విడుదలైనప్పుడు కరణ్ జోహర్ ఇలాంటి అద్భుతాలు దక్షిణాది దర్శకులు మాత్రమే చేయగలరు హిందీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ పారీతోషికం విషయంలో మాత్రం హిందీ వాళ్లు దక్షిణాది వాళ్ల కంటే ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. చైనాలో కూడా 2 పాయింట్ ఓ దూసుకుపోతుంది. బాహుబలి బిగినింగ్, ఆమిర్ ఖాన్ ‘పీకే’ రికార్డలను కూడా బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment