దటీజ్‌ రజనీ.. ‘2.ఓ’ ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే షాకే | Akshay Kumar 2PointO Earns Rs 370 Crore Even Before Its Release | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 7:47 PM | Last Updated on Sat, Nov 24 2018 8:38 PM

Akshay Kumar 2PointO Earns Rs 370 Crore Even Before Its Release - Sakshi

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ‘2.ఓ’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్‌ వస్తున్న ఈ సినిమా మరో ఐదు రోజుల్లో(నవంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే సగం బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని రాబట్టేసినట్లు సమాచారం.

రజనీకాంత్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన తొలి సినిమా ఇదే కాగా, ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా కూడా ఇదేనని అంటున్నారు. శాటిలైట్‌, డిజిటల్‌ తదితర హక్కులు కలిసి మొత్తం రూ.370 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రజనీ సరసన కథానాయికగా అమీజాక్సన్‌ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు జరిగిన బిజినెస్‌ గురించి అధికారికంగా మేకర్స్‌ ప్రకటించకపోయినా.. జరుగుతున్న ప్రచారం మేరకు కింది విధంగా రాబట్టిందని సమాచారం.

‘2.ఓ’ ఇప్పటి వరకూ రాబట్టిన వసూళ్ల వివరాలు

శాటిలైట్‌ రైట్స్‌:              రూ.120 కోట్లు(అన్ని వెర్షన్లలో)

డిజిటల్‌ రైట్స్‌ :                రూ.60 కోట్లు

నార్త్‌ బెల్ట్‌ రైట్స్‌ :               రూ.80 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ రైట్స్‌ : రూ.70 కోట్లు

కర్ణాటక రైట్స్‌:                      రూ.25 కోట్లు

కేరళ రైట్స్‌:                   రూ.15 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement