Rajni Kanth
-
హిందీని మాపై రుద్దొద్దు
చెన్నై: దేశమంతటా ఒకే భాష అమలు సాధ్యం కాదని సీనియర్ నటుడు రజనీకాంత్ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాదని, ఉత్తరాది రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తాయని బుధవారం మీడియాతో అన్నారు. దేశమంతటా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ దివస్ నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా, ఏకత్వానికైనా ఒకే భాష అవసరమని అయితే అది ఏ ఒక్కరో తీసుకురాలేరని అన్నారు. అందుకే హిందీని దేశమంతటా అమలు చేయలేమన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే. -
‘ఆ విషయంలో హిందీ దర్శకులు ఫెయిల్’
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ. 700 కోట్లు వసూలు చేసింది. 2. ఓనే కాకుండా గతంలో తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ భారత సిని చరిత్రలో రికార్డు సృష్టించాయి. వసూళ్ల పరంగా సునామీలా దూసుకు పోయాయి. మరో పక్క బాలీవుడ్లో భారీ అంచానలతో తెరకెక్కిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కపూర్ ‘భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు ఎందుకు విజయవంతమవుతున్నారు.. ముంబై దర్శకులు ఎక్కడ ఫెయిలవుతున్నారు..? దక్షిణాది దర్శకులకు సినిమాలంటే చాలా పాషన్. అందుకే వారు బాహుబలి, బాహుబలి 2, 2 పాయింట్ ఓ వంటి భారీ చిత్రాలు తీయగలిగారు అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి, 2. ఓ వంటి చిత్రాలు భారతీయ సినిమాల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయని పొగిడారు. ఇదే సమయంలో హిందీ దర్శకులు ఇలాంటి ప్రయత్నాల్లో వెనకబడ్డారని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో సినిమాల మీద విపరీతమైన అభిమానం ఉన్నవారే ఇండస్ట్రీకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. Why are Directors from Southern India succeeding in large scale films where Directors in Mumbai are failing? Directors from the South certainly show far more passion in their film making. Like in #Bahubali #Bahubali2 #2Point0 — Shekhar Kapur (@shekharkapur) December 12, 2018 గతంలో కరణ్ జోహర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ‘బాహుబలి 2 : ది కంక్లూజన్’ విడుదలైనప్పుడు కరణ్ జోహర్ ఇలాంటి అద్భుతాలు దక్షిణాది దర్శకులు మాత్రమే చేయగలరు హిందీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ పారీతోషికం విషయంలో మాత్రం హిందీ వాళ్లు దక్షిణాది వాళ్ల కంటే ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. చైనాలో కూడా 2 పాయింట్ ఓ దూసుకుపోతుంది. బాహుబలి బిగినింగ్, ఆమిర్ ఖాన్ ‘పీకే’ రికార్డలను కూడా బ్రేక్ చేసింది. -
కమల్ హాసన్‌కు వ్యతిరేకిని కాను
చెన్నై: తాను సినీ నటుడు కమల్ హాసన్‌కు వ్యతిరేకిని కానని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..తక్షణమే కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీల నిర్వహణ మంచిది కాదని సూచించారు. ఒకవేళ ఐపీఎల్ పోటీలకు వెళితే తమదైన రీతిలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్‌ను కర్ణాటకకు చెందిన వ్యక్తిని, అన్నా యూనివర్సిటీ వీసీని నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు. -
రజనీపై శరత్ కుమార్ ఘాటు విమర్శలు
-
తమిళనాట రజనీ మేనియా !
-
రాజకీయాల్లోకి రజనీ
-
కమల్ లక్ష్యంగా రజనీ వ్యంగ్యాస్త్రాలు..
-
278 రోజులే... డాట్!
చిట్టి (రోబో) ‘2.ఓ’ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేసింది. కానీ, చిన్న చేంజ్! మొన్నటిదాకా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నట్లు చెప్పిన చిట్టి... ఓ మూణ్ణెల్లు ఆలస్యంగా వచ్చే ఏడాది జనవరికి వస్తానని చెప్పింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ‘2.ఓ’. సుభాష్ కరణ్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ‘రోబో’ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అందువల్ల ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. నువ్విలా లేటు చేస్తే ఎలా? అని చిట్టీని అడిగితే... ‘లెక్కపెట్టుకోండి! ఈ రోజుతో కలిపి 278 రోజులే కదా! ఇట్టే గడుస్తాయి... డాట్’ అంది. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ –‘‘వీఎఫ్ఎక్స్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడం కోసమే దీపావళికి విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని జనవరి 25, 2018న విడుదల చేస్తున్నాం.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ‘2.ఓ’ ఇండియన్ సినిమాల్లో ఒక చరిత్ర సృష్టిస్తుంది’’ అన్నారు. అమీ జాక్సన్ కథానాయికగా, ప్రముఖ హిందీ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: ఆంటోని, కెమేరా: నిరవ్ షా, సంగీతం: ఏఆర్ రెహమాన్. -
జయను పరామర్శించిన రజనీకాంత్
-
జయను పరామర్శించిన రజనీకాంత్
- త్వరలో చెన్నైకి ప్రధాని: కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ - సింగపూర్ వైద్యుల చికిత్స! - తమిళనాడు వ్యాప్తంగా హోమాలు, గోపూజలు - నేడు అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం సాక్షి, చెన్నై: చెన్నై అపోలో ఆస్పత్రిలో 25 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించడానికి ప్రధాని మోదీ త్వరలోనే చెన్నై వస్తారని, అయితే ఎప్పుడనేది తెలియదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఆదివారం చెప్పారు. ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్, కూతురు ఐశ్వర్య ధనుష్.. ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు ప్రస్తుతం లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సింగపూర్‌లోని ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి చెందిన మహిళా వైద్యులను చెన్నైకి పిలిపించారు. వీరు జయలలితకు ప్రత్యేక ఫిజియోథెరపీ చికిత్స సాగిస్తున్నారు. అయితే, ఇద్దరు వైద్యులు సింగపూర్ నుంచి వచ్చినట్టుగా అపోలో వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. జయలలిత ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వదంతుల ఆరోపణలతో తమ పార్టీ కార్యకర్తలను వేధించడాన్ని డీఎంకే కోశాధికారి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఇదే ఆరోపణలతో డీఎంకే కౌన్సిలర్ నవనీతకృష్ణన్‌పై పొల్లాచ్చి, అతని స్నేహితులు ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదివేల ఆలయాల్లో దీప పూజలు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య క్షేమం కోసం ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా భక్తి భావం మిన్నంటింది. మృత్యుంజయ మహాయాగాలు, గో పూజలను అన్నాడీఎంకే వర్గాలు నిర్వహించాయి. పదివేలకు పైగా ఆలయాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్య దీప పూజలు నిర్వహించారు. తిరువళ్లూరులో వీరరాఘవస్వామి ఆలయంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, అన్నాడీఎంకే సభ్యుడు డాక్టర్ సునీల్, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారెడ్డిలతో పాటు వంద మంది వైద్యుల బృందం, అన్నాడీఎంకే వర్గాలు మృత్యుంజయ మహాయాగం నిర్వహించారు. ఇదిలాఉండగా అన్నాడీఎంకే పార్టీ సోమవారం 45వ వసంతంలోకి అడుగుపెట్టనుండగా నిరాడంబరంగా వేడుకలు జరుపుకునేందుకు అన్నాడీఎంకే వర్గాలు నిర్ణయించాయి. -
మోస్ట్ అవైటెడ్ మూవీగా కబాలి
-
చెన్నైలో తారాస్థాయికి చేరిన కబాలి ఫీవర్
-
కబాలిలో లేడిడాన్గా కనిపించబోతున్నరిత్విక ?
-
రజనీకాంత్ సినీప్రస్థానానికి 40 ఏళ్ళు
-
చిక్కుల్లో చియాన్ విక్రమ్
-
రజనీకాంత్ హీరో...విక్రమ్ విలన్..?