
చెన్నై: తాను సినీ నటుడు కమల్ హాసన్‌కు వ్యతిరేకిని కానని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..తక్షణమే కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీల నిర్వహణ మంచిది కాదని సూచించారు.
ఒకవేళ ఐపీఎల్ పోటీలకు వెళితే తమదైన రీతిలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్‌ను కర్ణాటకకు చెందిన వ్యక్తిని, అన్నా యూనివర్సిటీ వీసీని నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు.