త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తామంటూ సంకేతాలు ఇచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే వేదికపైకి వస్తే.. ఆ వేదికపై రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడితే.. అది హాట్ టాపిక్ అవుతుంది. ఆదివారం చెన్నైలో శివాజీ గణేషన్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదిక అయింది.