చెన్నై అపోలో ఆస్పత్రిలో 25 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించడానికి ప్రధాని మోదీ త్వరలోనే చెన్నై వస్తారని, అయితే ఎప్పుడనేది తెలియదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఆదివారం చెప్పారు. ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్, కూతురు ఐశ్వర్య ధనుష్.. ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు ప్రస్తుతం లండన్‌కు చెందిన వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్య బృందం చికిత్స కొనసాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.