
ఇండియన్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరు. మామూలుగానే తలైవా సినిమా వస్తోందంటే ఉండే సందడే ప్రత్యేకం. అందులోనూ త్రీడీ టెక్నాలజీ, అధునాతన సౌండ్ సిస్టమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటికంటే ముఖ్యంగా ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన ‘2.ఓ’ నేటినుంచి రికార్డుల వేటను ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యాయి. సోషల్ మీడియాలో యూఎస్ రిపోర్టులు కూడా వచ్చేశాయి. శంకర్ విజన్, రజనీ, అక్షయ్ నటన, విజువల్ ఎఫెక్ట్స్‌కు పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.
అయితే ఈ 2.ఓపై ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు రమేష్ బాలా స్పందించాడు. ‘ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటికీ రిప్. శంకర్ మరోసారి తను విజన్ ఉన్న మాస్టర్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు’ అంటూ ట్వీట్‌చేశాడు. ఇప్పటికే ప్రివ్యూ షోస్ చూసిన అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. రజనీ, అక్షయ్ కుమార్ నటనను పొగడ్తలతో ముంచెత్తుతుండగా.. శంకర్ అందించిన కథ,కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ మరోసారి తన సంగీతం ద్వారా మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లాడంటూ, ఇండియన్ సినిమాలను శంకర్ మరో మెట్టు ఎక్కించారంటూ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.
#2point0 RIP All current Box office records..
— Ramesh Bala (@rameshlaus) November 29, 2018
#2point0 [4/5] : Dir @shankarshanmugh has once again proved he is a visionary and a Master director.. 👏👏
— Ramesh Bala (@rameshlaus) November 29, 2018
Comments
Please login to add a commentAdd a comment