
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ విజువల్ వండర్ 2.ఓ. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సూనామీ సృష్టిస్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 2.ఓ ఇప్పుడు మరో రికార్డ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను చైనాలో ఏకంగా 56000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నారట.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసిన వర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో రూపొందించిన వర్సన్‌ను కూడా చైనాలో రిలీజ్ చేయనున్నారట. దాదాపు 10000 థియేటర్లలో 56000 స్క్రీన్స్‌పై రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు వీటిలో 47000 స్క్రీన్స్3డీవే కావటం విశేషం.
The Next Major Milestone for Team #2Point0 ➡️ MEGA Release In CHINA.. #2Point0InChina #2Point0MegaBlockbuster 🔥 @rajinikanth @akshaykumar @shankarshanmugh @arrahman @iamAmyJackson pic.twitter.com/RyWsNh5sUZ
— Lyca Productions (@LycaProductions) 4 December 2018
Comments
Please login to add a commentAdd a comment