స్టైల్‌కు పెట్టింది పేరు రజనీకాంత్. తలైవాకు అంత మంది ఫాలోవర్స్ ఏర్పడటానికి ప్రధానం కారణం తన మ్యానరిజం, స్టైలే. అందులోనూ స్టైల్‌గా సిగరెట్‌ను వెలగించడం ఫ్యాన్స్ మరిచిపోలేరు. రజనీకి అదొక సిగ్నేచర్ మూమెంట్ అయిపోయింది. అయితే రీసెంట్‌గా ‘2.ఓ’లో రోబో కూడా అదే సిగ్నేచర్ మూమెంట్ చేయడంతో థియేటర్స్‌లో విజిల్స్ మోతమోగాయి. అదీ ఆ మూమెంట్‌కు ఉన్న క్రేజ్. అయితే సిగ్నేచర్ ఈ మూమెంట్ వెనకున్న రహస్యాన్ని రజనీ ఇటీవలె వెల్లడించారు.
ఆ సిగరెట్‌ను మూమెంట్‌ను బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా దగ్గర నుంచి నేర్చుకున్నాని.. అప్పటినుంచి తాను కూడా అలా ప్రయత్నించానని, దానికి తన మ్యానరిజాన్ని కూడా కలిపానని తలైవా చెప్పుకొచ్చారు. అయితే సిగరెట్ స్టైల్‌గా నోట్లోకి విసరడం మాత్రమే సరిపోదని, దానికి తగ్గ టైమ్, సందర్భం, టైమింగ్ లాంటివి అవసరమని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ పాజిటివ్ టాక్‌తో రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment