సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన సినిమాను వీక్షించడానికి చెన్నైలోని ఓ థియేటర్‌కి వెళ్లారు. అయితే అక్కడ ఇప్పటికీ దీని సందడి కనపడుతోంది. రిలీజై పదిరోజులు గడుచినా.. ‘2.ఓ’ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీని త్రీడీ వర్షెన్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లు కలెక్ట్‌చేసి ఆల్‌టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది.
రజనీ.. నిన్న(డిసెంబర్ 8) సత్యం థియేటర్‌లో తన సతీమణి లతా రజనీకాంత్, మనువళ్లతో కలిసి ‘2.ఓ’ను వీక్షించారు. అయితే అక్కడికి వచ్చిన మిగతా ఆడియెన్స్ రజనీకి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా వారు ఉన్న చోటు నుంచే సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడిపోయారు. రజనీ సాధారణ ప్రేక్షకుడిలా మారి తన సినిమానే వీక్షిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment