దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి సిరీస్‌లతో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్ చేసిన థియేటర్స్ ఇలా ప్రతిదాంట్లో బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. అయితే వీటన్నంటికి ఇప్పుడు చెక్ పెట్టేయడానికి శంకర్ వస్తున్నాడు.
శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా 2.ఓ రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ విషయంలో బాహుబలి (రెండో పార్ట్‌ను 6,500 థియేటర్లలో రిలీజ్‌చేసినట్లు సమాచారం)ని క్రాస్ చేసేసిందని తెలుస్తోంది. ‘2.ఓ’ను దాదాపు 6,800 థియేటర్లలో దాదాపు పదివేల స్క్రీన్స్‌పై ప్రదర్శించనున్నట్లు సమాచారం. వీటిలో 7500 మంది ఇండియాలో కాగా, ఓవర్సీస్‌లో 2,500 తెరలపై ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు బద్దలుకావడం ఖాయమంటూ అభిమానులు సంబరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment