తమిళనాడును వణికించిన గజ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య కుటుంబంతో పాటు నటులు విజయ్ సేతుపతి, జీవి ప్రకాష్ కుమార్‌లు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది.
లైకా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే శంకర్ పది లక్షలు, రజనీ యాభై లక్షల విరాళాన్ని ప్రకటించగా... తాజాగా లైకా సంస్థ అధినేత సుభాస్కరణ్ రూ.1.01కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
#SaveDelta pic.twitter.com/tnKAYfZcVZ
— Lyca Productions (@LycaProductions) November 20, 2018
Comments
Please login to add a commentAdd a comment