సినిమా: నటి అంజలి చిత్రం కూడా 2.ఓ స్థాయిలో ఉంటుందా? దీనికి ఆ చిత్ర దర్శకుడు అవునంటున్నారు. ఏమిటీ నమ్మశక్యం కావడం లేదా? రజనీకాంత్ నటించిన సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ చిత్రం ఎక్కడ, నటి అంజలి నటిస్తున్న చిత్రం ఎక్కడ. ఊహించుకోవడానికే మనసంగీకరించడం లేదు అని అంటారా? అయితే నటి అంజలి నటిస్తున్న తాజా చిత్రం గురించి తెలుసుకుందాం. ఈ అమ్మడు తెలుగులో గీతాంజలి, తమిళంలో బెలూన్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. తాజాగా లీసా అనే చిత్రంలో నటిస్తోంది. ఇదీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రమే నటుంన్నారు దర్శకుడు రాజు విశ్వనాథన్. లిసా చిత్రం గురించి ఈయన తెలుపుతూ సాధారణంగా రూ.100నుంచి 200 కోట్ల బడ్జెట్‌తోనే 3డీ ఫార్మాట్ చిత్రాలు చేయడం అసాధ్యం అని భయపెడుతుంటారని, చిన్న బడ్జెట్‌లోనూ బ్రహ్మాండమైన విజువల్స్ చేయవచ్చునని, అదే లిసా చిత్రంలో చేశామని అన్నారు.
లిసా చిత్ర కథను మొదట థ్రిల్లర్ కథగానే తయారు చేసుకున్నానని, అయితే ఛాయాగ్రహకుడు పీజీ.ముత్తయ్య ఆ సమయంలో తన బ్యానర్‌లో ఒక దెయ్యం ఇతి వృత్తంతో కూడిన చిత్రం చేస్తారా? అని అడిగారన్నారు. దీంతో తాను తయారు చేసుకున్న థ్రిల్లర్ కథను హర్రర్‌గా మార్చానన్నారు. నిజం చెప్పాలంటే ట్రెండ్‌గా మారిన దెయ్యం కథా చిత్రాలకు కాస్త క్రేజ్ తగ్గిందని, తామూ అదే భాణీలో చిత్రం రూపొందిస్తే ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుందని భావించి కొంచెం భిన్నంగా 3డీ స్టీరియోస్కోప్‌లో లీసా చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సాధారణంగా 4కే ఫార్మాట్‌లో చిత్రాన్ని షూట్ చేసి దాన్ని 2కేకు మారుస్తారన్నారు. అయితే తాము 8కే ఫార్మెట్‌లో షూట్ చేసి 2కేకు మార్చామన్నారు. దీంతో చిత్రం సూపర్ క్యాలిటీగా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. లీసా చిత్రాన్ని 3డీలోనే కాకుండా 2డీలో చూసిన మంచి అనుభూతి కలుగుతుందని చెప్పారు. 2.ఓ చిత్రానికి పని చేసిన సీజీ టీమ్‌నే ఈ చిత్రానికి వర్క్ చేశారని తెలిపారు. ఈ కథను సిద్ధం చేసుకున్నప్పుడే అంజలి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు. కథ చెప్పగానే అంజలి నటించేందుకు ఒప్పుకోవడంతో మొదలైన లీసా చిత్రం ఇప్పుడు చాలా బాగా వచ్చిందని దర్శకుడు రాజు విశ్వనాథన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment